Monday, 2 November 2026

రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి ముండే మృతి

munda

ప్రధాని దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ, జూన్‌ 3 (జనంసాక్షి):

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గోపీనాథ్‌ ముండే (64) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఏరు ుమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రజ్ఞ, ము గ్గురు కుమార్తెలు (పంకజ, ప్రీతమ్‌, యశశ్రీ) ఉన్నారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఉదయం 6:20 గంటల సమ యంలో ఈ ప్రమాదం సంభవించింది. మోతీబాగ్‌ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఇండికా కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన ఇండికా కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్‌ సిగ్నల్‌ జంప్‌ చేసి దూసుకు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెనుక సీట్లో కూ ర్చొన్న ముండే ముందుసీటుకు బలంగా గుద్దుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన భద్రతా సిబ్బందిని అడిగి మంచినీళ్లు తాగారు. అనంతరం తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. భద్రతా సిబ్బంది హుటాహుటీన
ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. దాదాపు 50 నిమిషాల పాటు చికిత్స నిర్వహించిన అనంతరం ముండే కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారని పోస్టుమార్టంలో తేలింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు బీపీ, పల్స్‌ పెరిగి గుండెపోటు వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గోపీనాథ్‌ ముండే తీవ్ర ఆందోళనకు గురయ్యాయరని, ఆయనకు హైబీపీ, షుగర్‌ ఉన్నాయని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. బలమైన గాయాలేమీ కాలేదని, తీవ్ర ఆందోళనకు గురై మృతి చెంది ఉంటారని పేర్కొన్నారు. చివరికి 7:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కారీ, హర్షవర్ధన్‌ హుటాహుటినా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. కానీ, ఆయన ఇక లేరని తెలిసి ఆవేదనకు గురయ్యారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు గడ్కారీ మీడియాకు తెలిపారు. ముండేను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని గడ్కారీ వెల్లడించారు. ముండే భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయానికి తరలించి, అక్కడ నివాళులర్పించిన అనంతరం స్వస్థలమైన లాతూర్‌కు తరలిస్తామని గడ్కారీ తెలిపారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా..

మహారాష్ట్రలో సీనియర్‌ రాజకీయ నేత అయిన ముండే బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కష్టపడి జాతీయస్థాయికి చేరుకున్నారు. 1949 డిసెంబర్‌ 12న బీడ్‌లో జన్మించిన ముండే దివంగత బీజేపీ నేత ప్రమోద్‌ మహజన్‌కు బావమరిది. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఆయన విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అలా రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘ కాలం మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన ముఖ్యమంత్రి వ్యక్తి స్థాయికి చేరారు. 1980-85, 1990-2009 మధ్య కాలంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992-95 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1995-99 వరకు ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో బీజేపీ ఉప పక్షనేతగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం భీడ్‌ నుంచి 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ముండే జాతీయ స్థాయిలో బీజేపీ సముచిత స్థానం కల్పించింది. మే 26న మోడీ మంత్రివర్గంలో కేంద్ర గ్రావిూణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, తాగునీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రిగా చేపట్టారు.

ముండే మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి..

ముండే మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం, దేశం ఓ మంచి నాయకుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముండే నిజమైన ప్రజా నాయకుడని, కింది నుంచి స్థాయి జాతీయ స్థాయికి ఎదిగాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ముండే చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోడీ అండగా ఉంటామని తెలిపారు. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రకాశ్‌ జగదేకర్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌, శరద్‌పవార్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు ముండే మృతిపై దిగ్భాంతి వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *