పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై చర్చించే అవకాశం
హైదరాబాద్, జూన్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు రోజులపాటు రాజధానిలో పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ కానున్నారు. ఇతర కేంద్రమంత్రులనూ కూడా సీఎం కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా సీఎం ¬దాలో ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలపై సమగ్ర నివేదికలు తయారుచేయించి తీసుకెళ్లిన కేసీఆర్ వాటిని కేంద్ర మంత్రులకు సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధికి ఇతోధికంగా సాయం అందించాలని, నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. శాఖాపరంగా తెలంగాణకు రావాల్సిన నిధుల వాటాపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్ రద్దుపై ప్రధానితో పాటు రాష్ట్రపతితో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వెనుకు దురుద్దేశం ఉందని అక్కడ ఉన్న ఖనిజ సంపదనున బీజేపీ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దోచుకునే ప్రయత్నంలో భాగమే ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని కేసీఆర్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతోపాటు తెలంగాణలో విద్యుత్ కోరత, అదనపు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలై అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంపైనా కేంద్రంతో చర్చించే అవకాశాలున్నాయి.





