కేంద్రంతో సత్సంబంధాలే ఉంటాయి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (జనంసాక్షి) :
హైదరాబాద్ నగరాన్ని ఐటీ పరిశ్రమకు కేరాఫ్‌గా మలుస్తామని, నగరం ఐటీకి అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఐటీకి హైదరాబాద్ బ్రాండ్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఐటీ నిపుణులు ఆయనను కలిసినపుడు కేటీఆర్ మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీని రూపొందించి నూతన పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. దీని ద్వారా ఐదు లక్షల కొత్త జాబులు సష్టిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశమై భవిష్యత్ ఐటీ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఇక్కడ ఐటీ అభివృద్దికి ఎలాంంటి ఢోకా లేదన్నారు. ఐటీకి పర్యాయపదంగా హైదరాబాద్‌ను మార్చాలని కేటీఆర్ అన్నారు. ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీలు హైదరాబాదులో ఉండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను వ్లిపవాత్మక అభివృద్ధికి వేదికగా మారుస్తామని, అగశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇస్తామని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సహకాలు, రాయితీలు అందిస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. యూఎస్ లిటిల్ జాయింట్ ల్యాడర్‌సిస్టమ్స్ కంపెనీ బృందం శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. రూ.311 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో కంపెనీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్, బయోకెమిస్ట్రీ రంగాలతో పాటు మౌళికరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. యూఎస్ లిటిల్ జాయింట్ ల్యాడర్‌సిస్టమ్స్ రూ.300 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లు పెట్టుబడులు, ఉపాధి కల్పనపై పూర్తి స్తాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఐఐ, ఫ్యాప్సీ వంటి సంస్థలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతారని ఆ తర్వాత పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేసీఆర్ తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను ఆహ్వానిస్తారని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఢిల్లీ టూర్‌లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రానికి, కేంద్రానికి ఎలాంటి సంబంధాలు ఉండాలన్న దానిపై మోడీకి అవగాహన ఉందని, ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణకు న్యాయం చేస్తారని భావిస్తున్నామన్నారు. మోడీతో స్నేహపూర్వక, సహృద్భావ సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. పకడ్బందీ ప్రణాళికతో హైదరాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.





