Monday, 2 November 2026

తెలంగాణ తేజాలను అభినందించిన మోడీ

evarest
పూర్ణ, ఆనంద్‌లకు సత్కారం

న్యూఢిల్లీ, జూన్‌ 6 (జనంసాక్షి) :

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించి, సంచలనాన్ని నమోదు చేసిన తెలంగాణ తేజాలు పూర్ణ, ఆనంద్‌లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాసంస్థలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఆనంద్‌, తొమ్మిదో తరగతి చదువుతున్న పూర్ణ ఇటీవల ఎవరెస్ట్‌ను అధిరోహించి భారత జాతి పతాకను హిమశిఖరంపై ఎగురేశారు. ఢిల్లీలో శుక్రవారం తనను కలిసిన ఆనంద్‌, పూర్ణలకు ఆయన స్వయంగా జ్ఞాపికలు అందజేశారు. వారితో పాటు శిక్షకుడు బాబు కూడా ఉన్నారు. వీరిద్దరూ దేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. ఎవరెస్టు యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంటారని గురుకుల విద్యాసంస్థల చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *