
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
హైదరాబాద్, జూన్ 7:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల అభివృద్ధికి కేంద్ర ప్ర భుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యమని చెప్పారు. ఆహార ఆధారిత పరిశ్రమ లకే అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకుం టామని తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివా రం తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన నిర్మలా సీతారామన్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ ఆమెకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనం తరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిరే ్దశంతో అందరం కలిసి ముందుకు వెళ్దామన్నారు. గుజరాత్ తరహా అభివృద్ధి కోసం రాష్ట్ర బీజేపీ నేతల భాగస్వామ్యంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా నని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర
వ్యాప్తంగా పరిశ్రమలు, వాణిజ్యాభివృద్ధికి పాటు పడతానన్నారు. జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా వివక్షకు తావులేకుండా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వం నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందిస్తుందన్నారు. నల్లధనాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్‌మనీని వెనక్కుతెప్పించే అంశంపై కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై నిర్మల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలను అరికడతామని పేర్కొన్నారు. మహిళలకు విద్య, వైద్యం అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని వివరించారు. ఆహార ఆధారిత పరిశ్రమలకే అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలోని అంశాలకు అనుగుణంగానే మా విధానాలు ఉంటాయని తెలిపారు. ఎఫ్‌డీఐలపై మేనిఫెస్టోలో చెప్పిన మేరకే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఫారెన్ ట్రేడ్ పాలసీ తాత్కాలికంగా పొడిగించనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో యువతకు ఉపాధి కల్పనకు అవకాశం పెరిగిందని అందుకు తగిన శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించేందుకు నిర్మల నిరాకరించారు. ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలో పలు హామీలను ఇచ్చాయని, వాటిని అమలు చేసే బాధ్యత పార్టీలదేనన్నారు. రుణమాఫీ అంశం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని ఆయా పార్టీలు మేనిఫెస్టోల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయని వ్యాఖ్యానించారు.
రెండు రాష్ట్రాలకూ న్యాయం చేస్తాం




