Tuesday, 3 November 2026

విహార యాత్రలో విషాదం

viharayatra
హిమాచల్‌ నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్‌ విద్యార్థులు
20 మంది గళ్లంతు
కేబినెట్‌ సమావేశంలో స్పందించిన కేసీఆర్‌
హోం మంత్రితో సహా ప్రత్యేక బృందం హిమాచల్‌ వెళ్లాలని ఆదేశం
సిమ్లా, జూన్‌ 8 (జనంసాక్షి) :విహార యాత్రకు వెళ్లిన విద్యా ర్థులకు తీరని విషాదం ఎదురయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో సరదాగా గడిపి వద్దామని కలిసి వెళ్లిన స్నేహితుల్లో కొందరు నదిలో కొట్టుకు పోయారు. హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి విహా రయాత్రకు వెళ్లారు. వారు ఆదివారం సాయంత్రం మండి జిల్లాలోని బియాన్‌ నది వద్ద ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా నదిలో ప్రవా హం పెరిగింది. దీంతో 20 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. బియాన్‌ నదికి ఎగువన నిర్మించి లాల్జి జలాశయం గేట్లు ఒక్కసా రిగా ఎత్తడంతో నదికి భారీగా వరద వచ్చింది. సమాచారం అందు కున్న పోలీసులు గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజ్ఞానజ్యోతి కళాశాలకు
చెందిన 50 మంది విద్యార్థులు ఇటీవల విహారయాత్రకు వెళ్లారు. లాల్జి డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేసేప్పుడు అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నగరంలోని బాచుపల్లిలో గల విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల ఎలక్ట్రానిక్స్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌ విభాగానికి చెందిన 50 మంది విద్యార్థులు, ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈనెల 3న ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు వర్క్‌ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. వీరు ఫొటోలు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో నదిలో ఉన్న విద్యార్థులు కొట్టుకుపోయారు. అయితే ప్రమాద సమాచారం అందించినా హిమాచల్‌ప్రదేశ్‌ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని మిగతా విద్యార్థులు వాపోయారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే హిమాచల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అధికార బృందం వెంటనే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గ్రేహౌండ్స్‌ ఎస్పీ కార్తికేయ, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదరి బీఆర్‌ మీనా ఉన్నారు. వీరు సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌కు బయల్దేరి వెళ్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *