Tuesday, 3 November 2026

ఏపీ సీఎంగా చంద్రబాబు

chandrababunaidu
19 మందితో మంత్రివర్గం
రైతు రుణమాఫీపై తొలి సంతకం
హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి 7.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఆయనతో గవర్నర్‌ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయ నతో పాటు 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీకి రెండు బెర్తులు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరా జప్ప, కర్నూలుకు చెందిన బీసీ సామాజిక వర్గ నేతగా గుర్తింపు పొందిన కేఈ కృష్ణమూర్తికి ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. చంద్రబాబు తన మంత్రివర్గంలో తన సామాజికి వర్గానికి చెందిన మరో నలుగురికి చోటు కల్పించారు. అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పశ్చిమ గోదావరి
జిల్లాకు సుజాత, విజయనగరం జిల్లాకు చెందిన మృణాళితో పాటు బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాసరావుకు బాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు తెలిసింది. మంత్రివర్గంలో ఇతర సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, విశాఖపట్నంకు చెందిన అయ్యన్నపాత్రుడు, గంట శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుజాత, మాణిక్యాలరావు(బీజేపీ), ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చంనాయుడు, విజయనగరానికి చెందిన మృణాళిని, కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని ఉమామహేశ్వరరావు (బీజేపీ), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ నారాయణ, గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాడు పుల్లారావు, కిశోర్‌లకు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర్‌రావు, కామినేని శ్రీనివాస్‌రావు, విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 1995 నుంచి 2004 వరకు తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి దేశ వ్యాప్తంగా ప్రధాన నేతలు పలువురు హాజరవుతున్నారు. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంద్‌బెన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, దాదాపు పది మంత్రి కేంద్ర మంత్రులు, ఇంకా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *