రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల బండిని గట్టెక్కిస్తానని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఆది వారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చిస్తామని అన్నారు. తెలంగాణాలో ప్రయాణికుల సౌకర్యం దృష్టా ఆర్టీసీ చార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసు కుంటామన్నారు. రాష్ట్రంలోని పల్లెపల్లెకుయ బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. బస్ డిపోలను ఆధునీకరిస్తామని, అవసరమైతే కొత్త డిపోలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్
కాంప్లెక్స్‌లను నిర్మిస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో గతేడాది వోల్వో బస్సు ఆగ్నికి ఆహుతి అయిందని, అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆర్టీసీ నష్టాల బండిని గట్టెక్కిస్తా





