
రెవెన్యూ శాఖకు వన్నెతెస్తా
కలెక్టర్లు ప్రజలకు మరింత చేరువవుతారు
బాధ్యతలు స్వీకరించిన
డెప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తానని డెప్యూ టీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆది వారం ఆయన డి బ్లా క్‌లోని తన చాంబ ర్‌లో రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రిగా రెవెన్యూ
మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు వన్నె తెస్తానని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్థలాల సర్వేను ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు. మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ తాను సెక్యులర్ అని నిరూపించుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లు ప్రజలకు మరింత చేరువవుతారని, వారితో మమేకమై సేవలందిస్తారని తెలిపారు. అధికారుల్లో జవాబుదారి తనం పెంపొందిస్తామని ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అసెంబ్లీని అర్థవంతంగా నడిపిస్తాం
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని అర్థవంతంగా నడిపిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బోయినపల్లి కూర గాయల మార్కెట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌గా నామకరణం చేస్తూ రూపొందించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీ య హోదా కోసం కృషి చేస్తానన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణాలో నీటి పారుదలకు పటిష్ట మైన చర్యలు తీసుకుంటామని వివరించారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్దరిస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగు పరుస్తామని, ఐకేపీ కేంద్రాలను బలోపేతం చేస్తామని
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్
వెల్లడించారు. తెలంగాణాలో పండించిన విత్తనాలు దేశవ్యాప్తంగా సరఫరా చేసి తెలంగాణాను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శాసనసభ సమాశాలు అర్థవంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సభలో ప్రజల సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.




