Tuesday, 3 November 2026

అధికారుల విధి నిర్వహణలో మంత్రుల జోక్యం వద్దు

narendra
ప్రధాని నరేంద్రమోడీ

మంత్రివర్గానికి దిశానిర్దేశం
న్యూఢిల్లీ, జూన్‌ 10 (జనంసాక్షి) :
అధికారుల విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ప్రధా ని నరేంద్రమోడీ తన సహచరులకు స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారు. అధికా రులను స్వేచ్ఛగా పనిచేసుకోని వ్వాలని, ప్రతి అంశంలోనూ జోక్యం మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. అలాగే మంత్రులంతా తమ ఆస్తులు, అప్పులు, వాణిజ్య లావాదేవీ లకు సంబంధించిన వివరాలు రెండు నెల ల్లోగా అందజేయాలని సూచించారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి ముందు నిర్వ హించిన వ్యాపార, వాణిజ్య లావాదేవీలు, యాజమాన్య స్థానాల నుంచి వైదొలగాలని, అన్ని ఆర్థిక ప్రయోజనాలతో అనుబంధం తెంచుకోవాలని వారికి మార్గ నిర్దేశనం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రవర్తనా నియామవళిని
సిద్ధం చేయించారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తయారు చేసిన ప్రవర్తనా నియామవళిని విడుదల చేశారు. ఈ ప్రవర్తనా నియమావళిని ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తారు. పౌర సేవల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, విధులు, బాధ్యతల నిర్వహణలో వివాదాలకు తావిచ్చే విధంగా అధికారుల పనితీరులో జోక్యం చేసుకోవద్దని మంత్రులకు సూచించారు. మంత్రులు తమ స్థిర, చరాస్థులతో పాటు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఆ షేర్ల విలువ, కుటుంబ సభ్యుల ఆభరణాల జాబితాతో కూడిన పూర్తి వివరాలు వెల్లడించాలని మోడీ ఆదేశించారు. సంబంధిత మంత్రులు తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆస్తులు, ఆదాయాలపై ప్రకటన జారీ చేయాల్సి ఉంటుందని, దీనిని కచ్చితంగా పాటించాలని అన్నారు. ఆగస్టు 31లోగా మంత్రులు తమ వార్షిక లావాదేవీలను తెలియజేయాలని సూచించారు. అలాగే పలు కేబినెట్‌ కమిటీలను రద్దు చేస్తూ మోడీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కేంద్ర కేబినెట్‌ కమిటీలను రద్దు చేశారు. ఆధార్‌ కార్డుల జారీ కోసం ఉద్దేశించిన కమిటీని కూడా రద్దు చేశారు. మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ నేచురల్‌ కెలామటీస్‌, ధరల కమిటీ, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ మేటర్స్‌ కమిటీలను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని కమిటీలను పునర్వ్యస్థీకరించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అపాయింట్‌మెంట్స్‌, ఎకనామిక్‌ ఎఫైర్స్‌, పార్లమెంటరీ ఎఫైర్స్‌, పొలిటికల్‌ ఎఫైర్స్‌, భద్రత కమిటీలను పునర్వ్యస్థీకరించే ఆలోచనలో మోడీ ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *