Tuesday, 3 November 2026

సహాయ చర్యలకు భారీ వర్షం అడ్డంకి

klus

నేడు మానవ రహిత విమానంతో

ఏరియల్‌ సర్వే

వరదతో కొట్టుకొచ్చిన బురద

కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు

సిమ్లా, జూన్‌ 11 (జనంసాక్షి) :

బియాస్‌ నదిలో గల్లంతయిన విద్యార్థుల గాలింపునకు మళ్లీ ఆటంకం కలిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బియాస్‌ నది, లార్జి డ్యాం పరిసర ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. దాంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలను నిలిపివేశాయి. ప్రతికూల వాతావరణంతో గాలింపు చర్యలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక అధికారులతో ఆయన చర్చిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. నీరు మంచు కరిగి వచ్చింది కావడం వల్ల చల్లగా ఉందని, దానివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. విద్యార్థుల బాడీలు లభించే వరకు ఇక్కడే ఉంటామని అన్నారు. ఇదిలావుంటే హిమాచల్‌లోని బియాస్‌ నదిలో విద్యార్థుల మృతదేహల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాద స్థలానికి ఆరు కిలోవిూటర్ల దూరంలో ఓపీ నాలా వద్ద బుధవారం మరో మృతదేహం లభ్యమైంది. ఇవాళ లభ్యమైన మృతదేహంతో మొత్తం ఏడుగురు విద్యార్థుల మృతదేహలు లభించాయి. సహాయక చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. తమ పిల్లల డెడ్‌ బాడీ అయినా దొరుకుతుందా అని కన్నీరుమున్నీరు అవుతున్నారు. బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థులకోసం గురువారం నుంచి మానవరహిత ఏరియల్‌ వాహనంతో గాలింపు చేపట్టనున్నారు. నేడు జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పాట్నా, గౌహతి, కోల్‌కతాల నుంచి 3 జట్ల గజ ఈతగాళ్లను రప్పిస్తామని సంస్థ అధ్యక్షులు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. బియాస్‌ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల ఆచూకీ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, ¬ంమంత్రిని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. నేవీ సిబ్బందిని రంగంలోకి దింపాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్‌ చేశారు. శాటిలైట్‌ ద్వారా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయాలని కిషన్‌ రెడ్డి సూచించారు. మరోవైపు బియాస్‌ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే.

లిప్తకాలంలో కొట్టుకుపోయిన విద్యార్థులు

యూట్యూబ్‌లో వీడియో ప్రత్యక్షం

హిమాచల్‌ ప్రదేశ్‌లో లార్జీ డ్యామ్‌ వద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఫొటోలు దిగుతు న్న విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీ విద్యార్ధులు క్షణాల్లో జలసమాధి అయ్యారు. వీరి ఆనందం అంతా నాలుగు నిముషాల్లో ఆవిరయ్యింది. ఆర్తానాదాలు చేస్తున్నా రక్షించే వారు లేకుండా పోయారు. ముప్పు ముంచు కొస్తున్న ముందుకు కదలలేక నీటిలో కొట్టుకు పోయారు. ఇదంతా ఎలా జరిగిందో, వీరంతా ఎలా కొట్టుకు పోయారో చూపించే వీడియో ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ దినపత్రిక అమర్‌ ఉజాలా వెబ్‌ సైట్‌ యూట్యూబ్‌లో ఉంచింది. అంతవరకు ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు నీరు తక్కు వగా ఉండడంతో నది మధ్యలో ఉన్న ఓ పెద్ద బండరాయి ఎక్కారు. అంతలోనే వరద వస్తుందని గుర్తిం చి అరుపులు కేకలు పెట్టారు. గట్టుకు దగ్గరగా ఉన్న విద్యార్థులు పరుగున ఒడ్డుకుచేరారు. కొందరిని కిరణ్‌ అన అనే విద్యార్థి రక్షించాడు. అయితే తాను తిరిగి వచ్చే క్రమంలో కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయాడు. డ్యామ్‌కు వీరున్న ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది. నీరు వదలడానికి, అది ఇక్కడికి చేరడానికి కనీసం అరగంట పడుతుందని అంటున్నారు. అయితే వీరు నది ప్రాంతానికి చేరుకున్న నాలుగు నిముషాల్లోనే వరదలా వచ్చిన నదినీరు వీరిని పొట్టన పెట్టుకుంది. నది ఒడ్డున ఉన్న కొందరు పర్యాటకులు అలవోకగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇదేదో ఉపద్రవం వస్తుందని వారు ఊహించలేదు. అయితే నీళ్లు వచ్చాఏ సమయానికి ఒడ్డున ఉన్న పర్యాటకులు కూడా బిగ్గరగా కేకలు వేస్తూ పైకి వచ్చేయండని కోరారు. నీటి సవ్వడిలో వారు వేసిన కేకలు ఎవరికీ వినిపించలేదు. కాళ్లకిందకు నీరు చేరే వరకు ఎవరికి కూడా తెలియకుండా లిప్త కాలంలో జరిగిపోయింది. తమను తాము రక్షించుకోవాలనుకున్న విద్యార్థులు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని ఎత్తయిన బండపైనే ఉన్నా లాభం లేకుండా పోయింది. దీంతో అందరూ చూస్తుండగానే వరదలో ఒక్కొక్కరుగా కొట్టుకు పోయారు. పూర్తి రాళ్లమయంగా ఉన్న ప్రాంతం కావడంతో విద్యార్థులు చాలా గాయాలపాలయ్యారని తెలుస్తోంది. అలాగే బురదలో కూరుకుని పోయి ఉంటారని కూడా భావిస్తున్నారు.

పూర్తయిన దేవాశిష్‌ అంత్యక్రియలు

హైదరాబాద్‌ : హిమాచల్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి దేవాశిష్‌ బోస్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య బుధవారం పూర్తయ్యాయి. మంగళవారం అతడి మృతదేహాన్ని నగరానికి పంపారు. కుటుంబసభ్యులు, స్నేహితులు వందలాదిగా హాజరై అతడికి శ్రద్దాంజలు ఘటించారు. ఉదయం బాగ్‌అంబర్‌పేటలోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ నుంచి గన్‌ఫౌండ్రీలోని కేథలిక్‌ చర్చి వరకు జరిగిన అంతిమయాత్రలో దేవాశిష్‌ స్నేహితులు, స్థానికులు, బంధువులు పెద్దఎత్తున పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కింగ్‌కోఠీలోని శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు పూర్తిచేశారు. అతని మృతితో తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *