Tuesday, 3 November 2026

ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడ్డాం

etela

ఇది మాకు భగవద్గీత, ఖురాన్‌ : మంత్రి ఈటెల

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) :

ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నా మని, అది ప్రభుత్వానికి భగవద్గీత, ఖురాన్‌ లాంటిదని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ప్రజా సమస్య లను అపహాస్యం చేయవద్దని ఆయన రాజకీ య పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తమపార్టీ ఎన్ని కల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే కార్యక్ర మాలను అమలు చేస్తామన్నారు. ఇది తమకు భగవద్గీత, ఖురాన్‌ లాంటిదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందుకే గవర్నర్‌ ప్రసంగంలో తా ము చేయబోయే పనులనే చెప్పామన్నారు. అ సెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన సహ చర మంత్రులు మహేందర్‌రెడ్డి, జోగురామన్న లతో కలసి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. లక్షలోపు రైతు

రుణమాఫీకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లాకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని హామీనిచ్చారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఆపాలని టీఆర్‌ఎస్‌ ఆనాటి నుండే ఉద్యమిస్తుందన్నారు. ఈ అంశంపై మాట్లాడే నైతికత కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. పోలవరంపై మాట్లాడే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ఏవైతే హావిూలు ఇచ్చామో అవన్నీ తప్పకుండా అమలుచేసి తీరుతామన్నారు. తెలంగాణ ఏర్పడిన సందర్భంలో అభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్తశుద్దితో ప్రకటన చేశారని అన్నారు. అయినా గవర్నర్‌ ప్రసంగాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శించడం తగదన్నారు. వందలాదిమంది యువకుల త్యాగాల ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఐదేళ్లలో తగిన విధంగా న్యాయం చేస్తామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు. తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. రాబోమే మూడేళ్లు ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి సమస్యను తీరుస్తామన్నారు. అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, అన్ని జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు, కొత్త పారిశ్రామిక విధానం అమలు, పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్‌ విండో విధానం, ఫార్మా రంగం అభివృద్ధికి చర్యలు, హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ప్రాధాన్యత, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పరిశ్రమ ఏర్పాటు, వాల్మీకి, బోయలను ఎస్టీ కలుపుట, ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌, నేరాల నియంత్రణకు సాంకేతికంగా అత్యున్నత నిఘా వ్యవస్థ, హైదరాబాద్‌లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హావిూనిచ్చారు. ఇవన్నీ కూడా గవర్నర్‌ ప్రసంగంలో పొందుపరిచామన్నారు. తెలంగాణలో ప్రతి పౌరుడికి సమాన ¬దా, అవకాశాలు, రక్షణ కల్పిస్తామని పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని కీలక అంశాలను గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *