
మెగా నగరాలుగా విజయవాడ, విశాఖ, తిరుపతి
రైతు రుణమాఫీకి కట్టుబడ్డాం : చంద్రబాబు
విశాఖపట్టణం, జూన్ 12 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కేబినెట్ సమావేశం గురువారం వి శాఖలోని ఆంధ్ర వర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. అ వశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు తన విజ న్ ఆవిష్కరించారు. భవిష్యత్‌లో చేయబోయే, చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించారు. కష్టాలు ఉన్నా, నష్టాలు ఉ న్నా అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. విశా ఖపట్టణంలో కేబినేట్ భేటీ జరగడం ఆనందంగా ఉందని అంటూ విశాఖ అభివృద్దిక ప్రత్యేక చర్యలు తీసుకుంటామ న్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం మొదలు, మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, రోడ్ల
ఆధునీకరణ తదితర కార్యాక్రమాలను ప్రకటించారు. అలాగే విశాఖ,తిరుపతి, విజయవాడ నగరాలను మెగాసిటీలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబునాయుడు అన్నారు. కార్పొరేషన్లుగా ఉన్న నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి కనీసం 4,5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఐదేళ్లు మాత్రమే ఇచ్చిందని.. దానిని కనీసం పదేళ్లకైనా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. విభజన తర్వాత ఆంధప్రదేశ్ రూ.15,900 కోట్ల లోటులో ఉందన్నారు. మ్యాట్ ద్వారా రాష్ట్రానికి రూ3 వేల కోట్లు ఆదాయం రానుందని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులన్నీ పారదర్శకంగా అమలు చేస్తామన్నరు. గ్యాస్ ఆధారిత పరిశ్రమలు చాలా వచ్చే అవకాశముందని త్వరలోనే పెట్రో కారిడార్ వస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తెస్తామన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోందని… బొగ్గు నిల్వలు లేకుండా చేశారని దీంతో కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారన్నారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించి త్వరలోనే ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌సరఫరా చేస్తామన్నారు. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో మారుస్తామన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు, చేనేతను ఆదుకోవడమే తమ ప్రభుత్వం తొలి ప్రాథామ్యమని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, బెల్టు షాపుల రద్దుపై కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్‌కు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు పెద్ద ఎత్తున రావడానికి వీలుగా పారదర్శక విధానాలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధప్రదేశ్ యువతరానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ ముందున్న బాధ్యత అంటూ రైతులను ఆదుకోవడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని పునరుద్ఘాటిస్తూ విద్యుత్ సరఫరా వ్యవస్థ అంతా సర్వనాశనం చేశారని, విద్యుత్ సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా కరెంటు ఇచ్చే పరిస్థితి లేదంటూ, పెద్ద ఎత్తున బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వలకు అవకాశాలు పెంచుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంతో కూడా మాట్లాడి ఎక్కడ వీలైతే అక్కడనుంచి విద్యుత్తు తీసుకువస్తామని ఆయన హావిూ ఇచ్చారు. ఇంకా సౌర విద్యుత్తును, గాలిమరలతో కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్టు ఆయన చెప్పారు. వేసవిలో ఈ వనరులను బాగా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. ఆంధప్రదేశ్‌ను అదనపు విద్యుత్తు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అంటూ దీనివల్లే పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అభివర్ణిస్తూ విశాఖపట్నం నగరం అన్ని విధాలా హైదరాబాద్‌కు దీటైన నగరం అని ఆయన ప్రశంసించారు. విశాఖను వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. విశాఖపట్నానికి హైదరాబాద్‌లా ఐటిఐఆర్‌ను తీసుకువస్తామని, దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను ఎడ్యుకేషన్ హబ్‌గా, వాణిజ్య హబ్‌గా, టూరిజం హబ్‌గా, ఐటి హబ్, ఫిల్మ్ ఇండస్ట్రీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన హావిూ ఇచ్చారు. రాబోయే నాలుగైదేళ్లలో మంచి నీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికులను ఆదుకోవాలని ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు వెల్లడిస్తూ ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రజలు అందరికీ రెండు రూపాయలకే మినరల్ వాటర్‌ను అందించాలని నిర్ణయించినట్టు ఆన చెప్పారు. తాగునీటి పరిస్థితి రాష్ట్రంలో చాలాదారుణంగా ఉందంటూ స్వాతంత్య్రం వచ్చాక 67 సంవత్సరాల తర్వాత కూడా మంచినీళ్లు లేవంటే ఎంత బాధ పడాలి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే నాలుగైదేళ్లలో మంచినీటి కొరతను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జలయజ్ఞం పేర కాంగ్రెస్ 80 వేల కోట్లు తినేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. వితంతువులకు, వికలాంగులకు రూ.1000 ఫించన్, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు అంశంపై కూడా చర్చించినట్లు చెప్పారు. బెల్లు షాపులు ఎక్కడున్నా మూసివేతకు ఆదేశాలు జారీచేశామన్నారు.ఆంధప్రదేశ్ కొత్త రాజధాని కోసం ప్రజలంతా ఎంతో కొంత విరాళమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవాలయాల్లో ప్రతిరోజూ ఐదువేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. సింహాచలం, అన్నవరం, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం తదితర ఆలయాల్లో నిత్య అన్నదానం అమలు చేస్తామన్నారు. యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. వాతావరణ పరిరక్షణ కింద విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా యూనివర్శిటీ ఉద్యోగులు భారీ విరాళం ఇచ్చారు. రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏయూ ఉద్యోగులు అందించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింహాద్రి శ్రీవరాహలక్ష్మి నరసింహస్వామిని ఉదయం దర్శించుకున్నారు. స్వామివారికి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు ఆలయ అధికారులు బాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సింహాచలం ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు విరాళాలు అందజేశారు. ఆలయ ఉద్యోగులు రూ.3.09 లక్షలు, ఈవో రూ. 50 వేల విరాళాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం




