Tuesday, 3 November 2026

సముద్రుడికి కోపం వచ్చింది

samudram

ముంబై వాసులకు సాగరముప్పు
ముంబై, జూన్‌ 13 (జనంసాక్షి) :అరేబియా సముద్రం ఆగ్రహంతో ఊగిపోతోంది. ముంబై తీరప్రాంతంలో సముద్రం 4 మీటర్ల ఎత్తున అల లు ఎగసి పడుతున్నాయి. దీంతో గ్రేటర్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ నగర వాసులను అప్రమత్తం చేసింది. ఈవారంలో 4.5 అడుగుల ఎ త్తున ఎగసిపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొ న్నారు. శుక్రవారం నుంచి జూన్‌ 18వ తేదీ
వరకు 4.5 మీటర్లకు పైగా అలలు ఎగసి పడే అవకాశముందని ప్రభుత్వం సర్క్యులర్‌ విడుదల చేసింది. నగరవాసులు సముద్రం దగ్గరకుండా వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసీజీఎం తెలిపింది. దక్షిణ ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్దకు ప్రజలెవ్వరూ వెళ్లకుండా నిరోధించడానికి 15 మంది సెక్యురిటీ గార్డులను నియమించినట్టు పేర్కొంది. సముద్రం హోరెత్తడంతో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గిర్గావ్‌, బాంద్రా, జుహూ, విర్సోవా, అక్సా, గొరయి బీచ్‌, చౌపాటి బీచ్‌ లాంటి ప్రాంతాల్లో అగ్నిమాపక, జాతీయ విపత్తు స్పందన బలగం సిబ్బంది, లైఫ్‌ గార్డులతో కూడిన ఆరు బృందాలను మోహరింపజేసినట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *