Tuesday, 3 November 2026

ఆంధ్రా డబ్బాలపై కేసీఆర్‌ ఫైర్‌

fair
అడ్డగోలు వార్తలపై గుస్సా
తమిళనాడు తరహాలో కేబుల్‌ చట్టం?
తెలంగాణానూ కించపరిస్తే చూస్తూ సహించం
సభా వేదికగా సీఎం కేసీఆర్‌ హెచ్చరిక
టీవీ చానెళ్లపై చర్యలకు సభ తీర్మానం
హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) :
శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన ఆంధ్రా చానల్‌, పత్రి కపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణ యాన్ని తెలంగాణ శాసనసభ సభ్యులు అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్లకు అప్ప గించారు. ఈ మేరకు సభ్యు లు శనివారం ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. అందు బాటులో ఉన్న చట్టాలను పరి శీలించి తగిన చర్యలు తీసు కోవాలని సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్‌, మండలి చైర్మన్‌లకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం శాసనసభ విరామసమయంలో హాల్‌- 1లో ఓ చానల్‌ శాసనసభను కించ పరుస్తూ ఇటీవల ప్రసారం చేసిన కథనా న్ని ప్రదర్శించారు. స్పీకర్‌ మధుసూ దనాచారి, మండలి చైర్మ న్‌ భాస్కరరావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రతిపక్ష నేత జానా రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ తదితరు లు వీక్షించారు. ఈ సందర్భంగా సదరు చానల్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొందర పాటుకు గురైన తనను పదే పది చూపిస్తూ కించపరచడంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగ శోభ కన్నీరుపెట్టుకున్నారు. అనంతరం సదరు చానల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సభ్యులంతా తీర్మానం చేశారు. అనంతరం సమావేశమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు ఓ తీర్మానం ప్రతిపాదించారు. శాసనభ గౌరవాన్ని కించపరిచిన కథనాన్ని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోందని సదరు చానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభను కించపరిచిన చానల్‌పై చర్యలు తీసుకొనే నిర్ణయాన్ని స్పీకర్‌కు అప్పగిస్తూ తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణానూ సహిస్తే సంహించబోమని కేసీఆర్‌ తీవ్రస్వరంతో హెచ్చరించారు. తమిళనాడు తరహాలో కేబుల్‌ చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *