Tuesday, 3 November 2026

తెలంగాణ శకుంతల ఇకలేరు

telANGANA-SE
హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) :
ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల(63) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. ఆమె అసలు పేరు కడియాల శకుంతల. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. హైదరాబాద్‌ శివారు కొంపల్లిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శకుంతల మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహారాష్ట్రలో జన్మించిన శకుంతలకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణ యాసతో పేరొందిన ఆమె తన పేరును తెలంగాణ శకుంతలగా పిలుచుకునేలా చేశారు. పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ నటిగా విలక్షణ పాత్రలు పోషించారు. 1981లో మా భూమి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన శకుంతలకు గులాబీ చిత్రం నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తెలంగాణ యాసకు ఆమె ప్రత్యేకత తీసుకొచ్చారు. నువ్వు-నేను, లక్ష్మీ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. ఆమె మొత్తం 71 చిత్రాల్లో నటించారు. పాండవులు, పాండవులు తుమ్మెదా ఆమె నటించిన చివరి చిత్రం. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఫిల్మ్‌ఛాంబర్‌లో శకుంతల పార్థివదేహాన్ని ఉంచగా పలువురు నివాళులు అర్పించారు. గుండె పోటుతో మృతి చెందిన సినీ నటి తెలంగాణ శకుంతల భౌతికకాయానికి పలువురు సినీ, బుల్లితెలర నటులు నివాళులర్పించారు. శకుంతలతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలో జన్మించిన శంకుతల నాటకరంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ శంకుతల మొదటి సినిమా మాభూమి(1981)తో రంగ ప్రవేశం చేశారు. చివరిగా పాండవులు పాండవులు తుమ్మెద(2014)చిత్రంలో నటించారు. శంకుతల నటించిన చిత్రాల్లో నువ్వు-నేను, లక్ష్మి మంచి గుర్తింపు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *