
గాలింపు నిలిపివేసిన అధికారులు
రెండ్రోజులుగా దొరకని విద్యార్థుల ఆచూకీ
సిమ్లా, జూన్ 14 (జనంసాక్షి) :
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం బియాస్ నది మీద ఉన్న మూడు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను తగ్గించి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రమాదం జరిగి ఏడు రోజులు కావొస్తున్నా ఇప్పటికి ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది కలిసి గాలిస్తున్నప్పటికీ రెండ్రోజుల నుంచి ఒక్క మృతదేహాన్ని కూడా వెలికితీయలేదు. ఎన్డీఆర్ఎప్, ఐటీబీపీ, నౌకాదళ డైవర్లు గాలిస్తున్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ జాడ లభించలేదు. తెలంగాణ బెటాలియన్స్ డీజీ రాజీవ్ త్రివేది నేతృత్వంలోని పోలీసుల బృందం గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
ఫలించని ప్రయత్నాలు..
శనివారం ఉదయం 7 గంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు లార్జీ డ్యాం నుంచి తొలిసారి పూర్తిగా నీటి విడుదల నిలిపివేశారు. దీంతో నదిలో నీటిమట్టం చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే గల్లంతైన 16 మంది విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి మూడు కిలోమీటర్ల మేర విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 700 మంది సహాయక సిబ్బంది నదిని జల్లెడ పట్టారు. హైదరాబాద్ నుంచి 15 మంది డైవర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. డీజీ రాజీవ్ త్రివేది స్వయంగా నదిలో దిగి గాలింపు చేపట్టారు. వారికి తోడు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గాలించారు. కానీ ఫలితం లేకపోయింది. ఒక్క మృతదేహం కూడా లభించలేదు. దీంతో సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎగువ నుంచి మంచు కరిగి డ్యామ్ నిండిపోవడంతో ఉదయం 10 గంటలకు దిగువకు నీటిని వదిలారు. దీంతో సహాయక బృందాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. తొలి నాలుగు రోజుల గాలింపు ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద ఘటనకు మూడు కిలోవిూటర్ల దూరంలోపు దాదాపు అవన్నీ రాళ్ల మధ్య చిక్కుకొని, బురదలో కూరుకుపోయి లభించినవే. ఈ నేపథ్యంలో మిగతా మృతదేహాలు కూడా అదే పరిసరాల్లో ఉంటాయని సహాయక సిబ్బంది శనివారం పూర్తి దృష్టి అక్కడే కేంద్రీకరించారు.
మల్లగుల్లాలు..
అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభించక పోవడంతో రెస్క్యూ సిబ్బంది నిరాశకు లోనవుతున్నారు. అన్ని విధాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా ఫలితం లేకపోవడంతో తదుపరి ఏం చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా ఫలితం లేదు. ప్రతికూల పరిస్థితులు, సవాళ్ల నడుమ మరింత కాలం ఆపరేషన్ కొనసాగించడం సాధ్యం కాదని భావిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సందిగ్ధత నెలకొంది. మృతదేహాల వెలికితీతకు ఇంకా ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు. ప్రతికూల పరిస్థితుల వల్ల తమ ప్రయత్నాలు సలఫం కావడం లేదని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. ‘మా డైవర్లు ప్రధానంగా దృశ్య స్పష్టత (పూర్ విజిబిలిటీ) సమస్యను ఎదుర్కొంటున్నారు. నీరు మబ్బుగా ఉండడం, నదీ పూర్తి నీటిమట్టంతో ఉండడంతో పాటు బురద ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డంకిగా మారాయి’ అని చెప్పారు.
బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆచూకీ కోసం ఆదివారం చెన్నై నుంచి ప్రత్యేక కెమెరాలు తెప్పించి, గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. నేవీకి చెందిన సోనార్ కెమరాలతో గాలింపు చేపడతామని విపత్తు నిర్వహణా కమిటీ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. డ్యామ్ దిగువన మూడుకిలోవిూటర్ల వరకు మృతదేహాలు లేవని నిర్ధారణకు వచ్చామని అన్నారు. ఇక ఈ కెమరాలతో ఆ పైన నిరంతర అన్వేషణ చేస్తామన్నారు. ఈక్రమంలో అధికారులతో ఆంధప్రదేశ్, తెలంగాణ మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఉదయం నుంచి లార్జీ డ్యాం నీటి విడుదలను నిలిపి వేసి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, నౌకాదళ డ్రైవర్లు కూడా గాలింపు చర్యలు చేపడుతన్నారు. తల్లిదండ్రలు తమ బిడ్డల శవాలు దొరికితే చాలని దీనంగా అక్కడ విలపిస్తున్నారని అన్నారు. నదిమొత్తం బురదతో నిండిపోవడం వల్ల గాలింపు దుర్లభంగా మారి కింద ఏదీ కనపడడం లేదన్నారు. సాధ్యమైనంతగా పిల్లల దేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు ఈ నెల ఎనిమిదో తేదీన బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. ఈ సంఘటనలో విద్యార్థులదే తప్పని యాజమాన్యం భావిస్తోందని, కానీ నిజానికి వారిని పర్యటనకు తీసుకెళ్లిన ట్రావెల్స్‌కు అసలు అనుభవం లేదని, ఆ ట్రావెల్స్ కంపెనీకి లైసెన్సు కూడా లేదని వారు మండిపడ్డారు. కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావును తల్లిదండ్రులు ఈ విషయమై గట్టిగా నిలదీశారు. ఈ సంఘటనలో విద్యార్థుల తప్పు లేదని, నది పక్కనే రోడ్డు ఉండటంతో వాళ్లు లోనికి దిగారని, ఘటనలో తప్పు ఎవరిదనే విషయం విచారణలో తేలుతుందని వీఎన్ఆర్ కాలేజి ప్రధాన కార్యదర్శి డీఎన్ రావు తెలిపారు. చనిపోయిన విద్యార్థులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు తాము ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్
లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు
ఎమ్మార్పీ అతిక్రమిస్తే కఠిన చర్యలు
సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని ఆయన తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో సంప్రదించి ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మద్యం విధానం ఈనెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం విధానం జులై 1వ తేదీన ప్రారంభమై 2015 జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. కొత్తమద్యం విధానంలో ఆరు కేటగిరీలు ప్రకటించారు. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 2,216 మద్యం దుకాణాలు ఉండగా, ఆరు శ్లాబ్లుగా దుకాణాలను వర్గీకరించారు. ఇందులో జనాభా ఆధారంగా దుకాణాలను కేటాయిస్తారు. 10వేల జనాభా వరకు లైసెన్స్ ఫీజు రూ.32.50లక్షలు ఆ నిర్ణయించారు. 10 నుంచి 50వేల జనాభా వరకు రూ.34లక్షలు, 50వేల నుంచి 3లక్షల జనాభా వరకు రూ.42 లక్షలు, 3 లక్షల నుంచి 5లక్షల జనాభా వరకు రూ.50లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.68 లక్షలు, 20 లక్షలుపైగా జనాభా వరకు లైసెన్స్ ఫీజు రూ.90లక్షలుగా నిర్ణయించారు. దుకాణాల సంఖ్య ఆధారంగా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా కేటాయింపులు చేపడతారు.
ఫలించని ప్రయత్నాలు




