
లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు
ఎమ్మార్పీ అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత న మద్యం విధా నాన్ని ప్రకటించింది. 2014-15 మద్యం విధానాన్ని శనివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌ డ్ విడుదల చేశారు. మద్యపానం వల్ల కలిగే నష్టాలు, అన ర్థాలనుయ వివరించేందుకు జిల్లా కో డీఅడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని ఆయన తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో సంప్రదించి ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మద్యం విధానం ఈనెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం విధానం జులై 1వ తేదీన ప్రారంభమై 2015 జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. కొత్తమద్యం విధానంలో ఆరు కేటగిరీలు ప్రకటించారు. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 2,216 మద్యం దుకాణాలు ఉండగా, ఆరు శ్లాబ్‌లుగా దుకాణాలను వర్గీకరించారు. ఇందులో జనాభా ఆధారంగా దుకాణాలను కేటాయిస్తారు. 10వేల జనాభా వరకు లైసెన్స్ ఫీజు రూ.32.50లక్షలు ఆ నిర్ణయించారు. 10 నుంచి 50వేల జనాభా వరకు రూ.34లక్షలు, 50వేల నుంచి 3లక్షల జనాభా వరకు రూ.42 లక్షలు, 3 లక్షల నుంచి 5లక్షల జనాభా వరకు రూ.50లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.68 లక్షలు, 20 లక్షలుపైగా జనాభా వరకు లైసెన్స్ ఫీజు రూ.90లక్షలుగా నిర్ణయించారు. దుకాణాల సంఖ్య ఆధారంగా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా కేటాయింపులు చేపడతారు.




