Tuesday, 3 November 2026

ఎంతవెతికినా కానరాని ఆచూకీ

mruthulu
సోనార్‌ స్కాన్‌ వాడినా ఫలితం శూన్యం
సిమ్లా, జూన్‌ 15 (జనంసాక్షి) :
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతయిన విద్యార్థుల ఆచూకీ కోసం ఎంతవెదికినా ఫలితం లేకుండా పోతోంది. వారం రోజుల క్రితం ఇండస్ట్రియల్‌ టూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు బియా స్‌ నదిలో ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగ డంతో 24 మంది కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో తొమ్మిది మంది మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకు లభ్యమ య్యాయి. గత రెండు రోజులుగా ఎంత వెదికినా ఒక్కరి ఆచూకీ కూడా గాలింపు బృందాలు కనిపెట్టలేకపోయాయి. బియాస్‌ నది నుంచి నీటిని పూర్తిగా నిలిపివేసి వెదుకుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం గల సోనార్‌ సైడ్‌ స్కానర్‌, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ వినియోగించినా విద్యా ర్థుల ఆచూకీ తెలియరాలేదు. ఇలాంటి
పరిస్థితుల్లో బియాస్‌ నది వద్ద విద్యార్థుల కోసం పడిగాపులు కాస్తున్న వారి తల్లిదండ్రులు స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాలింపు చర్యలు ముగిసిన అనంతరం మండి జిల్లా కలెక్టర్‌, అధికారులతో పాటు, గాలింపు బృందం బాధ్యులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు గల్లంతయిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. వారిలో ఏ ఒక్కరూ కూడా జీవించి ఉండే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుందని మండి ఎస్పీ ఆర్‌ఎస్‌ నేగి మీడియాకు చెప్పారు. నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనుపయోగించి గాలించినా ప్రయోజనం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో కొండలు, గుట్టల మధ్య ఉండటం మంచిది కాదు కాబట్టి స్వస్థలాలకు వెళ్లాలని ఆయన కోరారు. గల్లంతయిన వారి ఆచూకీ లభిస్తే తామే సమాచారం అందిస్తామని చెప్పారు. దీంతో బాధతప్త హృదయంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్వస్థలాలకు సోమవారం బయల్దేరనున్నారు. కళాశాలకు చెందిన ఇద్దరు ప్రతినిధులు మాత్రం హిమాచల్‌లోనే అందుబాటులో ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *