
రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ
శ్రీనగర్, జూన్ 15 (జనంసాక్షి) :
కాల్పుల విరమణ పాటిస్తేనే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని భారత రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో రెండు పర్య టనలో భాగంగా ఆయన శ్రీనగర్‌లో ఆదివారం మీడియాతో
మాట్లాడారు. పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ ప్రాంతంలో చొరబాట్లను కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అడ్డుకుని కాశ్మీరీ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తామని చెప్పారు. భారతదేశ రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవించే ఎవరితోనైనా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాకిస్థాన్‌లా తాము కవ్వింపులకు, కాల్పులకు దిగడం పెద్ద విషయమేమీ కాదని ఆయన అన్నారు. తాము అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉన్నాం కాబట్టే పాక్ సైన్యం ఎంతలా కవ్వింపులకు పాల్పడినా సంయమనం పాటిస్తున్నామని, దీనిని బలహీనతగా తీసుకోవద్దని హెచ్చరించారు.
చొరబాట్లను అరికడతాం




