
వెంకయ్యనాయుడు తీరుపై వీహెచ్ ధ్వజం
హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర మంత్రి అనే విషయాన్ని విస్మరించి సీమాంధ్ర ప్రాంతీ యుడిగా వ్యాఖ్యలు చేసిన వెంకయ్యనా యుడుపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు ధ్వజమెత్తారు. తనదైన శైలిలో వెంక య్య తీరును కడిగి పడేశారు. ఆయన దేశానికి మంత్రా? ఆంధ్రాకు మంత్రా? తేల్చుకోవాలని హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చే యాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఖ మ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం చం ద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనా యుడులే తీసుకువచ్చారని వీహెచ్ విమర్శిం చారు. పోలవరం
ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. పోలవరం డిజైన్‌ను మారిస్తేనే అంగీకరిస్తామని అన్నారు. పోలవరంపై వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక కేంద్రమంత్రి దేశంలోని అన్ని ప్రనాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ఉండాలి తప్ప ఏ ఒక్క ప్రాంతానికో అనుకూలంగా వ్యవహరించకూడదని వీహెచ్ అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఏ ఉద్యమానికైనా సిద్ధమేనని తెలిపారు. తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ తిరస్కరించినా కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినట్టుగానే, తెలంగాణ శాసనసభ పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని తీర్మానించినా పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఆయన వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ విషయం సాధ్యమయ్యేది కాదని అన్నారు. అమలుకాని హామీలతో ప్రజలను గందరగోళ పరచవద్దని అన్నారు. మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని అన్నారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి అస్పష్టంగా ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతురుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని వీహెచ్ అన్నారు. ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంసరికాదని అభిప్రాయపడ్డారు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం పేరును మారిస్తే సహించేది లేదని అన్నారు. తెలంగాణలోని పది జిల్లా కేంద్రాల్లో రాజీవ్‌గాంధీ విగ్రహాలను నెలకొల్పుతామని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఆ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి సరైన రీతిలో తీసుకుపోలేకపోయారని వీహెచ్ అన్నారు.
అరే.. బై! నువు దేశానికా మంత్రి? ఆంధ్రాకా?




