Tuesday, 3 November 2026

జయకు సుప్రీంలో చుక్కెదురు

jayalalitha
అక్రమాస్తులపై విచారణ వద్దన్న పిటిషన్‌ కొట్టివేతరి
న్యూఢిల్లీ, జూన్‌ 17 (జనంసాక్షి)
తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే అధినేత్రి జయలలితకు సు ప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ఆమె అక్ర మాస్తులు కలిగి ఉన్నా రనే కేసులో విచారణపై స్టే
విధిం చాలన్న పిటిషన్‌ను సుప్రీం తోసి పుచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో జయలలితపై విచారణకు సుప్రీం కోర్టు గతంలో స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేసింది. రూ.66 కోట్ల రూపాయల ఆస్తులను జయలలిత అధికంగా కలిగి ఉన్నారని, వాటిని చెన్నైకి చెందిన లెక్స్‌ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ పేరిట బినామీగా ఆమె కలిగి ఉన్నారని గతంలో చెన్నై కోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా దాని విచారణను బెంగళూర్‌లోని ఓ న్యాయస్థానంలో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లెక్స్‌ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ తమకు జయకూ ఎలాంటి సంబంధం లేదని, తమ ఆస్తులను అనవసరంగా జప్తు చేశారంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు గతంలో దీనిపై స్టే ఇవ్వగా తాజాగా దానిని ఎత్తివేసింది. చెన్నై కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదనే నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని 2003లో బెంగళూర్‌ కోర్టుకు బదిలీ చేశారు. లెక్స్‌ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీతో తనకెలాంటి సంబంధం లేదని జయ వాదిస్తుండగా, ఆ సంస్థ కూడా అదే వాదనను తెరపైకి తీసుకువచ్చింది. అయితే సుప్రీం కోర్టును వీటిని విశ్వాసంలోకి తీసుకోకుండా విచారణ కొనసాగించేందుకు అనుమతిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *