
రంజాన్, బోనాల ఏర్పాట్లపై సమీక్ష
పాతబస్తీలో పర్యవేక్షించిన
డెప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి సారిగా జరుపుకో బోయే రంజాన్, బోనాల పండు గలను ఘనంగా నిర్వహించాల ని డెప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళ వారం ఎక్సైజ్ శాఖ మంత్రి ప ద్మారావుగౌడ్‌తో కలిసి పాతబ స్తీలో రంజాన్, బోనాల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తె లంగాణ, హైదరాబాద్ ప్రజలు కలిసి మెలిసి జరుపుకునే ఈ పండుగలను వైభవోపేతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మక్కామ సీదును పరిశీలించారు. లాల్‌ద ర్వాజ మహంకాళీ ఆలయం వద్ద పండుగ ఏర్పాట్లను వారు పరిశీ లించారు. రంజాన్ మాసంలో మజీదులకు నిరంతరాయంగా విద్యుత్
సరఫరా చేయాలని, తాగునీటిని అందించాలని సూచించారు. హైదరాబాదీలు పెద్ద ఎత్తున నిర్వహించుకునే బోనాల పండుగ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మహంకాళీ అమ్మవారి ఆలయంలో డెప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
తొలి పండుగలు ఘనంగా జరపండి




