
బగ్దాద్ పట్టణం స్వాధీనం దిశగా మిలిటెంట్లు
నలభై మంది భారతీయులు అపహరణకు గురైనట్లు సమాచారం
విడిపించేందుకు కేంద్రం యత్నాలు
తెలంగాణ బిడ్డల క్షేమ సమాచారంపై రాష్ట్ర సర్కారు హై అలర్ట్
హెల్ప్‌లైన్ల ద్వారా సహాయం
న్యూఢిల్లీ, జూన్ 18 (జనంసాక్షి) : ఇరాక్‌లో షియాల ప్రభుత్వాన్ని గద్దె దించి ఖలీఫా రాజ్యాన్ని సాధించేందుకు యుద్ధం ప్రకటించిన మిలిటెంట్ సంస్థ ఐఎస్‌ఐఎల్ విజయ బావు టా ఎగురవేసేందుకు దాదాపు సిద్ధమైంది. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు రాజధాని బాగ్దాద్ వైపు దూసుకెళ్తున్నారు. మరోవైపు, ఇరాక్‌లో ఉన్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తీవ్రవాదులు ఆక్రమించిన మొసుల్ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభించలేదు. వారిని కిడ్నాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసుల్ పట్టణంలో నిర్మాణ రంగంలో పని చేస్తున్న 40 మంది భారతీయుల ఆచూకీ లభించలేదు. వారిలో చాలా మంది కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తోంది. పంజాబ్ సహా పలు ప్రాంతాలకు చెందిన భారతీయులు అక్కడి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. అయితే, ఇరాక్‌లో అంతర్యుద్ధం తీవ్రం కావడం, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు మోసుల్ పట్టణాన్ని స్వాధీనం చేసు కోవడంతో అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి డోలాయమనంలో పడింది. ఇదిలా ఉంటే, భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మాజీ రాయబారి సురేశ్‌రెడ్డిని బాగ్దాద్‌కు పంపించాలని కేంద్రం
నిర్ణయించింది. ప్రస్తుతం ఇండోనేషియాలో పని చేస్తున్న సురేశ్‌రెడ్డి గతంలో ఇరాక్‌లో రాయబారిగా వ్యవహరించారు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన సహాయక చర్యలను పర్యవే క్షించేందుకు రాత్రి బాగ్దాద్ బయల్దేరి వెళ్లనున్నారు. మరోవైపు, తిక్రిత్‌లోని ఆస్పత్రిలో పని చేస్తున్న 46 మంది నర్సులను వెనక్కు రప్పించేందుకు కేంద్రం యత్నిస్తోంది. వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇరాక్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు. పరిస్థితులు చల్లారి భారత్‌కు తిరిగివచ్చే వరకూ.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. మోసుల్‌లో ఉన్న 40 మంది భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు సాధ్యం కావడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. తీవ్రవాదులు వీరిని బంధీలుగా ఉంచారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము నిర్ధారించలేమని బదులిచ్చారు. ఇరాక్‌లో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తీవ్రవాదుల లక్ష్యం భారతీయులు కాదని గుర్తు చేశారు. ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకూ భారతీయులు ఒక్కరూ కూడా గాయపడినట్లు సమాచారం రాలేదన్నారు.
40మంది అపహరణకు గురైనట్లు సమాచారం
ఇరాక్‌లో ఉన్న 600 మంది భారతీయుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు చేస్తోంది.అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చమురు సంపద పుష్కలంగా ఉన్న ఇరాక్‌లోని మోసుల్ నగరంలోని ఒక కన్‌స్టక్షన్ర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది భారతీయులు జాడ తెలియడం లేదు. వారిని ఐఎస్‌ఐఎస్ తిరుగుబాటుదారులు తీసుకువెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్‌ఐఎస్‌కు, కుర్ద్‌లకు మధ్య జరుగుతున్న యుద్ధానికి మోసుల్ ప్రధాన కేంద్రం అయింది. ఇక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమయంలో చాలా మంది కార్మి కులతో అధికారులకు సంబంధాలు తెగిపోయాయి. కుర్ద్‌ల ప్రాబల్యం ఉండే ఈ ప్రాంతాన్ని ఐఎస్‌ఐఎస్ ఆక్రమించింది. ఆ తరువాత భారత కార్మికుల జాడతెలియలేదు. అయితే భారత విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఎటువంటి సమాచారంలేదు. మోసూల్‌లో అభద్రత మధ్య 40 మంది భారతీయులు ఉన్న ట్లు తెలుస్తోంది. వారి యోగక్షేమాలు తమకు తెలియదని విదేశాంగ శాఖ చెబుతోంది. ఇదిలావుంటే భారత రాయబారి సురేష్‌రెడ్డి హుటాహుటిన ఇరాక్‌కు బయలుదేరారు. అయితే ఇరాక్‌లోని మోసుల్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న భారతీయులు అపహరణకు గురైనట్లు విదేశాంగ శాఖ ప్రకటిం చింది. 40 మంది భవన నిర్మాణ కార్మికులు అపహరణకు గురయ్యారని, అపహరణకు గురైనవారు ఉత్తర భారతవాసులుగా తెలుస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది. అపహరణకు సంబంధించి ఎవరి నుంచి ఫోన్‌కాల్స్ రాలేదని తెలిపింది. అపహరణకు గురైనవారి రక్షణ చర్యలు చేపట్టామని, ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం మూసివేయబోమని అధికారులు తెలిపారు. ఇరాక్‌లో ఉన్న 46 మంది నర్సులతో మాట్లాడామని, వారు భారత్ రావాలని కోరుకుంటున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలావుంటే ఇరాక్‌లో ఉన్న తెలంగాణ వాసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఇప్పటివరకు 600 మంది తెలంగాణ వాసులు ఇరాక్‌లో ఉన్నట్టు గుర్తించి నట్లు తెలిపారు. ఇరాక్‌లో ఉన్నవారి కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు. ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇరాక్‌లో తెలంగాణ వాసుల వివరాలు సేకరణ : చంద్రవదన్
ఇరాక్‌లో ఉన్న తెలంగాణవాసుల వివరాలు సేకరిస్తున్నామని కార్మికశాఖ కార్యదిర్శ,సమాచారశాఖ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ తెలిపారు. ఇప్పటి వరకు 641మంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని, నియామక సంస్థలను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అక్కడ సమా చారం తెప్పిస్తున్నామని అన్నారు. మనవాళ్లకు ఎలాంటి ఉపద్రవం లేదన్నారు. అలాగే వారంతా సేఫ్ ప్లేస్‌లో ఉన్నారని చెప్పారు. ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని అన్నారు.
ఇరాక్‌లోని వారిని ఆదుకుంటాం : మహమూద్ అలీ
హైదరాబాద్ : ఇరాక్‌లోని తెలంగా ణవా సులను ఆదుకుంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అక్క డ ఉన్న తెలంగాణ వాసుల
వివరాలు సేకరిస్తున్నామని, ఇప్పటివరకు అక్కడ 600లకు పైగా తెలంగాణవాసులు ఉన్నట్లు గుర్తిం చామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇరాక్‌లో తిరుగుబాట్ల విజయ బావుటా




