Tuesday, 3 November 2026

భారతీయులను విడిపిస్తాం

sushma

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) :

ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులను విడిపిం చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ మం త్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. బాధితుల కుటుం బ సభ్యులు తమను కలవడానికి వస్తున్నారని వా రిని క్షేమంగా భారత్‌ రప్పించేందుకు ప్రభుత్వం చేయాల్సిన ప్రతీ చర్యను చేస్తున్నామని చెప్పారు. భారతీయులను విడిపించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోబోమన్నారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఇరాక్‌లోని మోసుల్‌ పట్టణంలో ఉన్న 40 మంది భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువగా పంజాబ్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాకీ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌) నేతృ త్వంలో సున్నీ వర్గానికి

చెందిన వారు ఇరాక్‌పై యుద్ధంపై ప్రకటించారు. పలు పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ రాజధాని వైపు చొచ్చుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోసుల్‌లో ఉన్న 40 మంది భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. 40 మంది కిడ్నాప్‌ అయినట్లు ధ్రువీకరించిన విదేశాంగ శాఖ ఇంతవరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదని తెలిపింది. వారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సుష్మా చెప్పారు. గురువారం ఆమె డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇరాక్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో ఉన్న భారతీయలను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కిడ్నాప్‌ అయిన వారిని విడిపించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ‘(వారిని రక్షించేందుకు) అన్ని చర్యలు

కొనసాగుతున్నాయి. నేను వ్యక్తిగతంగా ఆయా చర్యలను పర్యవేక్షిస్తున్నా. అవసరమైతే మేం అక్కడికి వెళ్లేందుకు కూడా సిద్ధమేనని’ తెలిపారు. ఇరాక్‌లోని భారత రాయాబార కార్యాలయం మూసివేస్తారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. కేంద్రం ఇరాక్‌ ప్రభుత్వంతో పాటు ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి సహాక మిషన్‌తో తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌కు గురైని వారి సమాచారంతో పాటు అక్కడ ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనేందుకు యత్నిస్తోంది. దాదాపు 10 వేల మంది భారతీయులు ఇరాక్‌లో నివసిస్తున్నారు. వీరిలో వంద మందికి పైగా హింసాత్మమ ప్రాంతాల్లో చిక్కుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, ఐఎస్‌ఐఎల్‌ స్వాధీనం చేసుకున్న తిక్రిత్‌ పట్టణంలో చిక్కుకున్న 46 మంది నర్సులతో విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, ఇప్పటికే మాజీ రాయబారి సురేశ్‌రెడ్డిని అక్కడికి పంపించింది. మరోవైపు, పంజాబ్‌ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టింది. కిడ్నాప్‌కు గురైన పంజాబీలను సురక్షితంగా రప్పించేందుకు అవసరమయ్యే వ్యయం తాము భరిస్తామని ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *