Tuesday, 3 November 2026

రాజీనామా చేయండి

mank

ఎన్‌డీఎంఏ సభ్యులకు కేంద్రం హుకుం

మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామాన్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) :

యూపీఏ హయాంలో అధికార కేం ద్రాల్లో నియమితులైన వారందరినీ తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే రాజీనామా చేయాలని గవర్నర్లను ఆదేశించిన మోడీ సర్కారు తాజాగా జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్‌డీ ఎంఏ) సభ్యులను టార్గెట్‌ చేసింది. తక్షణమే రాజీనామా చేసి తప్పు కోవాలని కేంద్రం ఎన్‌డీఎంఏ సభ్యులకు స్పష్టం చేసింది. కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి అరుణ్‌ గోస్వామి ఈ మే రకు ఫోన్‌లో వారికి సమాచారమిచ్చారు. ఎన్‌డీఎంఏలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారంతా

యూపీఏ హయాంలో నియమితులైన వారే. ఎన్‌డీఎంఏ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో ఆయన రాజీనామా సమర్పించారు. రాజీనామా కోరినట్లు ఎన్‌డీఎంఏ మరో సభ్యుడు, సీఐఎస్‌ఎఫ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కేఎం సింగ్‌ కూడా ధ్రువీకరించారు. రాజీనామా చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే తాను రాజీనామా లేఖను సమర్పించాని తెలిపారు. అయితే, ఎవరి నుంచి ఫోన్‌ వచ్చిందనేది చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. మరోవైపు, రాజీనామా అంశంపై పౌరవిమానయాన శాఖ మాజీ కార్యదర్శి కేఎన్‌ శ్రీవాస్తవ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. దీనిపై ప్రస్తుతం స్పందించడం సరికాదన్నారు. రాజీనామా వార్తలను తాను ధ్రువీకరించలేనని, అలాగే ఖండించలేనని చెప్పారు.

ఇటీవలే అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు యూపీఏ హయాంలో నియమితులైన వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ వీర విధేయులుగా ఉన్న గవర్నర్లను రాజీనామా చేయాలని ఇప్పటికే ఆదేశించింది. తప్పుకోని వారిని తప్పించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. మరోవైపు, ఎన్‌డీఎంఏ, మహిళా కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులను తొలగించేందుకు దృష్టి సారించింది. రాజీనామా చేయాలని ఎన్‌డీఎంఏ సభ్యులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ¬ం శాఖ కార్యదర్శి ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. రాజీనామా చేయాలని సమాచారం వచ్చిందని ఎన్‌డీఎంఏ సభ్యుడు, సీఆర్పీఎఫ్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ జేకే సిన్హా ధ్రువీకరించారు. ‘ప్రతి ఒక్కరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే, నేను అందుబాటులో లేకపోవడంతో నాకు ఇంకా సమాచారం అందలేదు. నేను ఇతర సభ్యులతో మాట్లాడాను. వారు ఈ విషయాన్ని (రాజీనామా) ధ్రువీకరించారని’ చెప్పారు. ఎన్‌డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. అయితే, ఇదే విషయమై శశిధర్‌రెడ్డిని సంప్రదించగా రాజీనామా ప్రచారాన్ని కొట్టిపడేసినట్లు సమాచారం. ‘నేను రాజీనామా చేయలేదు. ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడతానని’ చెప్పారని తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు వెల్లడించారు. జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థకు చైర్మన్‌గా ప్రధాని ఉంటారు. వైస్‌ చైర్మన్‌, సభ్యులు ఉంటారు. భూకంపాలు, వరదలు వంటి విపత్తులకు సంబంధించి ఈ సంస్థ పర్యవేక్షించడం, సహాయక చర్యలు చేపట్టడం తదితర కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. ఎన్‌డీఎంఏ వైస్‌ చైర్మన్‌గా ఉండే వ్యక్తికి కేబినెట్‌ మినిస్టర్‌ ¬దా, సభ్యులకు సహాయ మంత్రి ¬దా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *