
బగ్దాద్/న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) :
ఇరాక్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిలిటెంట్ గ్రూపులు దాదాపుగా అక్కడి సైన్యంపై పైచేయి సాధించాయి. రాజధాని నగరం బగ్దాద్‌ను త్వరలోనే మిలిటెంట్లు స్వాధీనం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోం ది. సున్నీ వర్గానికి చెందిన మిలిటెంట్లు స్థాని క షియా సర్కారును గద్దెదించి ప్రజా ప్రభు త్వం ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేస్తు న్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడి వారి ని బందీలుగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోసూల్ పట్టణంలో 40 మంది భారతీయులు కిడ్నాప్ అయినట్లు వార్తలు రాగా వారంతా క్షేమంగా ఉన్నట్లు విదే శాంగ శాఖ ప్రకటించింది. శుక్రవారం విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బ రుద్దీన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇరాక్‌లో చిక్కుకున్న వారందరినీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరిం చారు. అక్కడి పరిస్థితులపై రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదిం పులు జరుపుతున్నామని తెలిపారు. విమాన చార్జీలు భరించే స్థోమత లేని వారిని ప్రభు త్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువస్తామని అన్నారు. మరోవైపు సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సు ష్మా స్వరాజ్‌ను కలిసి ఇరాక్‌లో బందీలుగా ఉన్న వారిని క్షేమం గా దేశానికి తీసుకు రవాలని విజ్ఞప్తి చేశారు. అనం తరం సుష్మాస్వరాజ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇరా క్‌లో బందీలుగా ఉన్న భా రతీ యులను
స్వదేశానికి రప్పించేందుకు చేపడుతున్న చర్యలపై మోడీ సమీక్షించారు. ఇకపోతే ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని దురాక్రమణకు పాల్పడ్డ అమెరికా తాజా పరిణామాలను నిశితంగా గమినిస్తోంది. ఇస్లామిక్ మిలిటెంట్లపై పోరాడేందుకు తమ దళాలు ఇరాక్‌కు వెళ్లబోవని అగ్ర రాజ్యాధినేత బరాక్ ఒబామా వెళ్లడించారు. అదేసమయంలో అవసరమైన పక్షంలో నిర్దిష్ట లక్ష్యంతో కూడిన సైనిక చర్య చేపడతామని చెప్పారు. ఇరాకీ ప్రజలకు ఆదేశానికి, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదులపై పోరాటానికి సహాయం చేస్తామని ఒబామా తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాక్ సమస్యను ఆ దేశమే పరిష్కరించుకోవాలని ఒబామా స్పష్టం చేశారు. కాగా మిలిటెంట్లపై వైమానిక దాడులు నిర్వహించాలని ఇరాక్, అమెరికాను కోరింది.
ఇరాక్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత




