అన్నివర్గాలపై రైల్వే భారం
త్యాగాలకు సిద్ధం కావాలన్న మోడీ
పెనుభారం మోపిన సదానందగౌడ
న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) : నరేంద్ర మోడీ సర్కారు బడ్జెట్‌కు ముందే ప్రజలపై పెను భారం మోపింది. రైల్వే చార్జీలను భారీగా పెంచింది. ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, 6.5 శాతం రవాణా ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఈనెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. దేశాభి వృద్ధి కోసం కఠిన చర్యలు తప్పవని గత కొన్ని రోజులుగా ప్రధాని చెబుతూ వస్తున్నారు. అవ కాశం లభించినప్పుడు రైల్వేశాఖ మంత్రి సదా నంద గౌడ కూడా ఛార్జీల పెంపుపై ప్రస్తావి స్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా రైలు ఛార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారీగా డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఛార్జీల పెంపు జరిగింది. దీంతో పాటు రైల్వేలో ప్రత్యక్ష, విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కూడా పచ్చజెండా ఊపాలని రైల్వేశాఖ భావిస్తున్నట్టు సమా చారం. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాం లో రైలు ఛార్జీలు పెంచినప్పుడు అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీతో రాజీనామా చేయించారు. ప్రస్తుతం పెరిగిన ఛార్జీలపై ఆమె ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. అయితే రైలు చార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలకు అన్ని రాజకీయ
పక్షాలు పిలుపునిచ్చాయి. అయితే సదానంద గౌడ స్పందిస్తూ గత ప్రభుత్వం పెంచకుండా భరిస్తూ వస్తున్న భారాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మోయడం వీలుకాదని అందుకే చార్జీలను పెంచామని చెప్పారు. జులై మొదటి వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు. ఈలోపునే చార్జీలు పెంచుతూ మోడీ సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది.
బడ్జెట్‌కు ముందే బాదుడు




