
తెలంగాణ మంత్రివర్గం నేడు కీలక భేటీ
హైదరాబాద్, జూన్ 20 (జనంసాక్షి) :
రైతు రుణమాఫీపై ప్రభుత్వం నేడు నిర్ణయాన్ని వెలువ రించనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్రావు నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ఈ కీలక భేటీలో రుణమాఫీ వల్ల ప్రభు త్వంపై పడబోయే భారం, బ్యాంకర్లకు ఎన్ని విడతల్లో బకాయిలు తిరిగి చెల్లించాలి, ఆర్బీఐకి లేఖ రాయడం తదితర అంశాలపై చర్చించనున్నారు. మొదట పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సర్కారు పేర్కొనగా తర్వాత రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు బంగారు కుదువపెట్టి తీసుకున్న రుణాల మాఫీకి సర్కారు ఓకే చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శాసనసభ, మండలిలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం రుణమాఫీ వల్ల పడే భారం 19 వేల కోట్లుగా బ్యాంకర్లు లెక్క తేల్చారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తేనే బ్యాంర్లు కొత్తగా రైతులకు రుణాలు మంజూరు చేస్తారని, బాండ్లను అంగీకరించబోమని, అలా చేస్తే కొత్తగా రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల దగ్గర డబ్బులుండవని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శికి లేఖ రాసింది. ఈ లేఖ నేపథ్యంలో రైతు రుణాల్లో కొంత మొత్తాన్ని మొదటి విడతగా చెల్లించి మరికొన్ని విడతలుగా మిగతా బకాయిలు చెల్లిస్తామని ఆర్బీఐకి లేఖ రాయనుంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, అన్ని శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పైనా ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.




