Tuesday, 3 November 2026

మన సచివాలయంలో విభజన రేఖలు

barikede
బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గిక్కడెందుకు?
పెదవి విరిచిన
ఇరు రాష్ట్రాల
ఉద్యోగ
సంఘాలు
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
న్యూఢిల్లీ, జూన్‌ 21 (జనంసాక్షి) :
సిగరెట్‌ ప్రియులకు మోడీ సర్కారు భారీ బహుమతే ఇవ్వబో
మన సచివాలయంలో విభజన రేఖలు వెలిశాయి. రాత్రికి రాత్రే సచివాలయంలో బారికేడ్లు ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాల మధ్య రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక సచివాలయం నుంచి మరో సచివాలయానికి రాకపోకలు లేకుండా పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రెండు సచివాలయాలకు వెళ్లాలంటే ఆయా సచివాలయాలకకు ఉన్న ద్వారాల గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి నుంచి పూర్తి స్థాయి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు బారికేడ్ల వద్ద బీఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బందిని కూడా నియమించారు. వాస్తవానికి విభజన ప్రక్రియ పూర్తయి, ఉద్యోగుల శాశ్వత కేటాయింపు ముగిసే వరకూ రెండు సచివాలయాల మధ్య పూలకుండీలు పెడతామని చెప్పిన ఉన్నతాధికారులు రాత్రికి రాత్రి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై సచివాలయ అధికారులు ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విషయం తెలియక వాహనాల్లో వచ్చిన అధికారులు, ఉద్యోగులు.. తిరిగి తమ సచివాలయం మార్గం నుంచి వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాల మధ్య పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బీఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించడంపైనా అభ్యంతరం తెలిపాయి. బీఎస్‌ఎఫ్‌ బలగాలను ఎలా మోహరిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఇంకా రెండు రాష్ట్రాల మధ్య విభజన పనులు పూర్తి కాకుండానే, ఉద్యోగుల కేటాయింపు కూడా జరగకుండానే ఎలా బారికేడ్లు పెడతారన్నారు. ఉద్యోగుల కేటాయింపు ప్రస్తుతం తాత్కాలికంగానే జరిగిందని, శాశ్వత ప్రాతిపదికన కేటాయింపు పూర్తయిన తర్వాత బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో ఇలాంటి ఏర్పాట్లు చేయడం వల్ల ప్రజలు, జిల్లాల్లో ఉన్న ఉద్యోగుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తెలంగాణకు కేటాయించిన సచివాలయం ఏ, బీ, సీ, డీ బ్లాకుల్లో ఉద్యోగులకు ఎలాంటి సదుపాయాలు లేవని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పేర్కొన్నారు. డిస్పెన్సరీ, స్కూల్‌, పోస్టాఫీస్‌, ఫైర్‌స్టేషన్‌ వంటి వసతులన్నీ సీమాంధ్ర సచివాలయానికే వెళ్లిపోయాయని ఈ నేపథ్యంలో తమకు ఎలాంటి వసతులు లేవన్నారు. పూర్తి స్థాయి వసతులు కల్పించిన తర్వాత, ఉద్యోగుల తుది కేటాయింపులు జరిగిన తర్వాత ఇలాంటి చర్యలు చేపడితే స్వాగతిస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాకే ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన రేఖ ఆంధప్రదేశ్‌, తెలంగాణ సచివాలయాల మధ్య స్పష్టంగా కనిపిస్తోంది. సచివాలయాన్ని రెండుగా చీల్చినా, ఇపప్పుడు పూర్తిస్థాయిలో బారీకేడ్లు ఏర్పాటు చేసి విభజనను స్పష్టం చేశారు. ఒక సచివాలయం నుంచి మరో సచివాలయానికి రాకపోకలు లేకుండా బారీకేడ్ల ఏర్పాటు చేశారు. దీంతో రెండు సచివాలయాలకు వెళ్లాలంటే ఆయా సచివాలయాలకు ఉన్న ప్రధాన ద్వారాల గుండానే వెళ్లాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే తెలంగాణ, ఆంధప్రదేశ్‌ సచివాలయాల మధ్య బారికేడ్లు వెలిశాయి. దాంతో రెండు రాష్ట్రాల సచివాలయాలను మధ్య విభజన రేఖ ఏర్పడినట్లు అయ్యింది. రెండు సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం రాత్రి నుంచి పూర్తిస్థాయి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు బారీ కేడ్ల వద్ద భద్రతా విభాగం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బందిని కూడా నియమించారు. సచివాలయాల ఉద్యోగులు రెండు వైపులకూ వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇక ఎక్కడి వారు అక్కడికే వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటుఇటు వెళ్లకుండా చూస్తున్నారు. ఇదంతా ఎపి సిఎం చంద్రబాబు సూచనల మేరకు చేశారని సమాచారం. తమ పరిధిలోకి తెలంగాణ వారు రావద్దని ఈ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *