
2009 నుంచి లక్షలోపు రుణాల మాఫీ శ్రీ32 లక్షల మంది అన్నదాతలకు రుణవిముక్తి
శ్రీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం
హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి) :
రైతు రుణమాఫీపై రెండు రోజుల్లో విధివి ధానాలు ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రుణమాఫీ కాల పరిమితిపై రైతుల్లో నెలకొన్న సం దేహాలను ఆయన నివృత్తి చేశారు. 2009 నుంచి రూ.లక్ష లోపు తీసుకున్న రుణాల న్నింటినీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రక టించారు. తద్వారా 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వంపై రూ.20 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు రుణాలు మాఫీ చేసి తీరతా మని స్పష్టం చేశారు. రుణమాఫీపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్న పోచారం రెండు మూ డ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపా రు. అంతకుముందు సీఎం కేసీఆర్ మం త్రులతో సమావేశమై రుణమాఫీపై చర్చిం చారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి పోచారం మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీకి
సంబంధించి అంతా సిద్ధమైందని తెలిపారు. పంటలకు సంబంధించిన రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. బ్యాంకర్ల నుంచి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని ఆ తర్వాత రెండు మూడ్రోజుల్లో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. గతంలో 2008 వరకు ఉన్న రుణాలు మాఫీ అయ్యాయని గుర్తు చేసిన పోచారం 2009 నుంచి తీసుకున్న రుణాలన్నంటినీ మాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. ఆంక్షలు లేకుండా పంట రుణాలు మాఫీ చేస్తామని శాసనసభలో, మండలిలో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు వెనక్కు తగ్గుతామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఎంతటి భారమైనా రుణాలు మాఫీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.లక్ష లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకనుగుణంగా ఇటీవల బ్యాంకర్లతో సమావేశమై సమాచారం సేకరించారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ వరకు తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం తొలుత సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే, బంగారం కుదువు పెట్టి తీసుకన్న లోన్లు, గిడ్డంగులో నిల్వ ఉంచిన పంటపై తీసుకున్న రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని పెట్టారు. ఏడాది కాల పరిమితి విధించడంపై అటు ప్రజల నుంచి, ఇటు విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. కాల పరిమితి, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రుణమాఫీపై పునరాలోచనలో పడింది. బంగారంపై తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తాజాగా కాల పరిమితితో సంబంధం లేకుండా 2009 తర్వాత తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమవారం హైదరాబాద్కు రానున్నారని పోచారం తెలిపారు. తెలంగాణలో వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు చెప్పారు. రుతుపవనాల కోసం మేఘమధనం చేయాల్సిన అవసరం లేదని అవి సహజంగానే వస్తాయన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని పోచారం అన్నారు. రెండుమూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని పోచారం అన్నారు. సచివాలయంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ సచివాలయాల మధ్య శుక్రవారం రాత్రి బారికేడ్లు వెలిశాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
రెండ్రోజుల్లో రుణమాఫీపై విధివిధానాలు




