
మూడెకరాల భూమి పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయండి
దళిత వాడల్ని ఆదర్శవాడలుగా తీర్చిదిద్దాలి
మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి) :
ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన దళితుల అభ్యున్నతికి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల హామీల అమలుపై ఆయన శనివారం మంత్రులు, అధికారులతో తెలంగాణ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమి పంపిణీ చేసేందుకు పటిష్టమై ప్రణాళికలు రూపొందించాలని సూచించా రు. దళిత వాడల్ని ఆదర్శకాలనీలుగా అభివృద్ధి చేయాలని, విద్యు త్, డ్రెయినేజీ, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించి తీర్చిది ద్దాలని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పార దర్శకంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి నిర్దిష్టమైన ప్రణా ళికలు సిద్ధం చేయాలని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సమీక్షించి అవసరమైన వాటిని కొనసా గించాలని అన్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీపై నిర్ణయం తీసుకోగా మిగతా సంక్షేమ పథకాలను త్వరలో సమీక్షించనున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమి పంపిణీకి సంబంధించిన నివేదికలు బడ్జెట్ సమావేశాల్లోపు రూపొందించాలని సూచించారు. పథ కాల అమలు తీరును తాను నేరుగా పర్యవేక్షిస్తానని, ఎట్టిపరి స్థితుల్లోనూ అలసత్వాన్ని సహించబోనని ఆయన అన్నారు.
దళిత అభ్యున్నతికి పటిష్ట ప్రణాళిక




