
రైల్వే చార్జీల పెంపు, హిందీ తప్పనిసరి రెండూ గత ప్రభుత్వ నిర్ణయాలే
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ, జూన్ 23 (జనంసాక్షి) :
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులు కీలక స్థా నాల్లో ఉంటే ఎలా ఉంటుందో చూపించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రతిదానికి యూపీఏ ప్రభుత్వమే కారణమంటూ తప్పును పోయిన ప్రభు త్వంపైకి నెట్టేస్తున్న వెంకయ్య ఆదివారం మరో అ డుగు ముందుకేశారు. కాపీ.. కట్.. పేస్ట్ అన్నట్టు యూపీఏ నిర్ణయాలనే తమ ప్రభుత్వం అమలు చేసిందని ఎదురుదాడికి
దిగారు. సోషల్ మీడియాలో హిందీ భాష వాడకం, రైల్వే చార్జీల పెంపు పాపం యూపీఏ ప్రభుత్వానిదేనని, రైల్వే చార్జీలను పెంచాలని యూపీఏ ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుందని దాన్ని తాము అమలు చేశామని, ఇంతమాత్రనికే నిందిస్తారా అంటూ ప్రశ్నించారు. వెంకయ్య ప్రశ్నలు, లాజిక్ లేకుండా మాట్లాడటాన్ని చూసి జాతీయ మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ధరల పెంపు, హిందీ భాష వాడకం నిర్ణయాలు తీసుకున్నా ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అమలును రద్దు చేసుకుంది. ఆ నిర్ణయాన్ని ప్రజామోదం ఎన్నికైన మోడీ సర్కారు ఎలా అమలు చేసింది? ఆ విషయాన్ని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో ఏమైనా అర్థం ఉందా? అంటే అధికారం చేపట్టి ఇంకా పది రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా అంటూ వెంకయ్యే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోశారు. దేశ ప్రజలపై ఒకే సారి రూ.8000 కోట్ల భారాన్ని మోపి దాన్ని గత ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకోవడం మోడీ సర్కారుకే చెల్లింది. యూపీఏ నిర్ణయాలను అమలు చేశాం ఈ విషయంలో తమకేం సంబంధం లేదంటూ వెంకయ్య తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తమ ప్రభుత్వం వల్లే ధరలు పెరిగాయా? ఢిల్లీలో కరెంట్ కోతలు ఉంటే మా పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. యూపీఏ భుజంపై తుపాకీ పెట్టి ప్రజలను కాల్చడానికి మోడీ సర్కారు సిద్ధం కావడం విచారకరమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
యూపీఏ నిర్ణయాలే అమలు చేస్తున్నాం




