
పీపీఏల రద్దు నిర్ణయంపై దత్తన్న ధ్వజం
హైదరాబాద్, జూన్ 22 (జనంసాక్షి) :
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధి బయటపడిందని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అ న్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఏపీ సర్కారు రద్దు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లన్న బాబు అసలు రంగు ఏమిటో ఇప్పుడు బయ టపడిందని అన్నారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు ఎప్పటికీ సీమాంధ్ర పక్షపాతేనని, తెలంగా ణాకు ఆది నుంచి అన్యాయం చేసినట్టుగానే ఇప్పుడూ చేస్తున్నాడని
ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో చర్చించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బాబు బుద్ధి బయటపడింది




