Tuesday, 3 November 2026

నేడు సత్యం కేసు తుది తీర్పు

jail
హైదరాబాద్‌, జూన్‌ 22
(జనంసాక్షి) :
కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సత్యం కుంభకోణంలో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. కోట్లాది రూపాయల ప్రజల డబ్బును సత్యం ప్రమోటర్లు దుర్వినియోగం చేయడంపై గత ఐదున్నర సంవత్సరాలుగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో అడిషినల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ స్పెషల్‌ కోర్టు గతవారం విచారణను పూర్తి చేసింది. తుది తీర్పు వెల్లడించడానికి 216 మంది సాక్షులను విచారించింది. 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. ప్రత్యేక న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తీర్పు తేదీని సోమవారం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. 2009 జనవరి 7వ తేదీన సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్‌ రామలింగరాజు ఒప్పుకోవడంతో కార్పొరేట్‌ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతోందని మనదేశంతో పాటు కార్పొరేట్‌, స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *