
రూ. 500 కోట్లతో డార్నర్ విమాన పరికరాల పరిశ్రమకు సీఎం శంకుస్థాపన
భారీ పెట్టుబడులకు హైదరాబాదే
బ్రాండ్ : సీఎం కేసీఆర్‌రి
హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి) :తెలంగాణలో త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలి పారు. ఇక నుంచి పారిశ్రామిక వేత్తలు అనుమతుల కోసం ప్రభుత్వ కార్యా లయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. పరిశ్రమల అనుమ తుల కోసం సింగిల్ విండో విధానం తీసుకువచ్చామని, అన్ని అనుమతులు అక్కడే లభిస్తాయని తెలిపారు. సింగిల్ విండో విభాగం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటుందన్నారు. పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకు తున్నామని, పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పారిశ్రామిక
కారిడార్‌లో రూ.500 కోట్లతో చేపట్టనున్న డార్నర్ విమాన పరికరాల పరిశ్రమ ఏర్పాటుకు కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఏరోస్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. పారిశ్రామిక వేత్తలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, ఏక గవాక్ష విధానం ద్వారా సత్వరమే అనుమతులు లభించేలా చూస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామన్నారు. తెలంగాణలో పెట్టబడులు పెట్టాలని జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. టాటా గ్రూప్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉందన్నారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్, రుయాగ్ ఏరోస్పేస్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణలో విమాన పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే సింగిల్ విండో విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు టాటా, రుయాగ్ సంస్థలు ముందుకొచ్చాయి. రూ.500 కోట్ల వ్యయంతో రెండు సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి దశలో విమాన ప్రధాన విభాగంతో పాటు రెక్కల తయారీని ప్రారంభిస్తారు. అనంతరం రెండో దశలో మొత్తం విమానాన్ని తయారు చేస్తారు.
తెలంగాణకు కొత్త పారిశ్రామిక విధానం




