
రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ, జూన్ 24 (జనంసాక్షి) :
ఇరాక్‌కు భారత సైన్యాన్ని పంపబోమని భారత రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ తేల్చిచెప్పారు. ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సహాయ చర్యల కోసం భారత సైన్యాన్ని ఇరాక్‌కు పంపిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ ఇరాక్‌కు భారత సేనలా.. ఊహాగానాలొద్దు.. అని సమాధానమిచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు. గతంలో శ్రీలంకకు శాంతిసేనను పంపిన తరహాలో అంటూ విలేకర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాక్‌లో సుమారు 120 మంది భారతీయులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోగా, 39 మంది భారతీయులను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఇరాక్‌లో మొత్తం 10వేల మందికి పైగా భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరందరిని వెనక్కి రప్పిస్తున్నామని అన్నారు.
ఇరాక్‌కు మన సేనలు పంపం




