ఐటీఐఆర్‌కు ప్రపంచ స్థాయికి గుర్తింపు
మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి):
గ్రామాల అభివృద్ధికి ఐటీ అనుసందానం చేస్తామని మంత్రి కె.తార కరామారావు వెల్లడించారు. ఐటీ విస్తరణకు ఇప్పటికే కార్యాచరణ రూపొం దిస్తున్నామని తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌తో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు సమావేశమ య్యారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పెట్టుబ డులు, మౌలిక వసతులపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతా మన్న కేటీఆర్ టాప్-5 రాష్టాల్ల్రో ఒకటిగా తెలంగాణ ఉండాలని యత్నిస్తున్నామని చెప్పారు. ఐటీ రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఐటీ సాయంతో గ్రామాలకు ప్రభుత్వ సేవలు అందేలా చూస్తామన్నారు. ఈ-పం చాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్‌కేర్‌లపై దృష్టి సారిస్తామని, ఆయా సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. అనర్హూలకు రేషన్, పింఛన్లు అందుతున్నాయ ని, ఐటీ సాయంతో ఇలాంటి అక్రమాలను నిర్మూలిం చనున్నట్లు వివరించారు. ఐటీఐఆర్ రాష్టాన్రికి
తలమానికం కానుందని, దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీఐఆర్‌ను ఏ రకంగా ప్రమోట్ చేయాలనే దానిపై వివిధ ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో 150 ఐటీ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీఐఆర్, ఐటీ రంగ విస్తరణపై ఆయా సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో 15 ఏళ్లకు సరిపడా ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుంటామన్నారు.




