Tuesday, 3 November 2026

తొలిదశ అక్రమ కట్టడాల నేలమట్టం

21 భవనాల కూల్చివేత

త్వరలో రెండో దశ: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి):

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ గురుకుల ట్రస్టులో అక్రమ భవనాల కూల్చివేతలో తొలి దశ ముగిసింది. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన 21 భవనాలను అధికారులు నేలమట్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురుకుల ట్రస్ట్‌ భూముల పరిరక్షణకు నడుం బిగించిన అధికారులు రెండ్రోజులుగా అక్రమ నిర్మాణాలను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 21 కట్టడాలను అక్రమంగా గుర్తించిన జీహెచ్‌ఎంసీ మంగళవారం 16 నిర్మాణాలను కూల్చివేసింది. మూడో రోజైన బుధవారం మరో ఐదు నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఉద యమే జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ధనుంజయ్‌ ఆధ్వర్యంలో అక్రమ భవనాలను నేలమట్టం చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఐదు బృందా లుగా విడిపోయిన అధికారులు గుర్తించిన భవనాలను కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకొనేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భవనాల కూల్చి వేతను నిరసిస్తూ శేరలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌

ఎమ్మెల్యేలు గాంధీ, వివేక్‌ కార్పొరేటర్లు రంగారావు, భానుప్రసాద్‌, అశోక్‌గౌడ్‌ తదితరులు అడ్డుకునేందుకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. మూడు గంటల పాటు స్టేషన్‌లో నిర్బంధించి, అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పెద్దవారి భవనాలను వదిలివేసి అమాయక ప్రజల భవనాలను కూల్చివేయడం అన్యాయమన్నారు. భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి డబ్బు చెల్లించినా కూల్చివేతలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేసి ఆయా భవనానలు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ కట్టడాలు, భూ కబ్జాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. గురుకుల ట్రస్ట్‌ భూముల స్వాధీనం, రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. గురుకుల భూముల్లో అక్రమంగా నిర్మాణం చేపట్టిన కట్టడాల తొలగింపుపై దృష్టి సారించారు.  హైదరాబాద్‌లోని గురుకుల ట్రస్ట్‌ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని సర్వే నెం. 11 నుంచి 37 వరకు ఉన్న స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఐదు బృందాలుగా విడిపోయిన సిబ్బంది మొత్తం 21 భవనాలను కూల్చివేశారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలపై ముందుగా దృష్టి సారించిన అధికారులు ఆ మేరకు వాటిని నేలమట్టం చేశారు. పూర్తిస్థాయి బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశారు. రెండో విడతలో మరిన్ని భవనాలను కూల్చాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలి దశలో నిర్మాణంలో ఉన్న వాటిపై దృష్టి పెట్టిన అధికారులు.. రెండో దశలో నిర్మాణం పూర్తయిన అక్రమ కట్టడాలను కూల్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగా యజమానులు నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత కూల్చేందుకు సమాయత్తమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు కాకుండా పక్కా ప్రణాళికతో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. గతంలో పలుమార్లు ఒకట,ి రెండ్రోజులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండి పోయారు. అది కూడా కేవలం మధ్యతరగతి వారి ఇళ్లను పడగొట్టిన అధికార గణం బడా బాబుల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి బడా బాబులను కూడా వదిలిపెట్టకూడదని అధికారులు నిర్ణయించారు. వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ నేతలకు సంబంధించిన నివాసాలు, వాణిజ్య భవనానలు నేలమట్టం చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *