
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :
తెలంగాణ ఐటీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నామని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్లో ఉన్న 150 ఐటీ కంపెనీ లతో శుక్రవారం సాయంత్రం భేటీ అవుతున్నామని అన్నారు. ఈ భేటీలో ఆయా కంపెనీల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రా న్ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా తయారు చేస్తా మని కేటీఆర్ తెలిపారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధిపై మం త్రి మాట్లాడుతూ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొ న్నారు. ఐటీ పాలసీని మరింత సమగ్రంగా రూపొంది స్తామన్నారు. మూడు రంగాలకు సంబంధించిన ఐటీ కం పెనీలతో శుక్రవారం రాత్రి నగరంలో సమావేశం నిర్వ హించనున్నట్లు తెలిపారు. ఇందులో అనేక అంశాలను చర్చించి వారి సలహాలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని అన్నారు. వచ్చే నెల మొదటివారంలో అమెరికాలో జరిగే ఆటా ఉత్సవాల్లో పాల్గొని ఐటీ అభివృద్ధికి తెలుగువారి సలహాలు స్వీకరిస్తామన్నారు. అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలతో కూడా ఆ సందర్భంగా సమావేశం అవు తామని, వారి నుంచి కూడా
హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా వాడుకుని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కూడా కేటీఆర్ తెలిపారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అభివృద్ధి చేసి 500 గోడౌన్లు నిర్మిస్తామని అన్నారు. ఉపాధిహామీ పథకాన్ని మార్కెటింగ్ శాఖతో అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సౌకార్యాలు లేక ఐకేపీ కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్వరలోనే రూ.200 కోట్ల వ్యయంతో 500 గోదాములను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ కోసం 20 లక్షల టన్నుల సామర్థంగల అధునాతన గోడౌన్లను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయిలో వీటిని నిర్మించి ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు.
తెలంగాణలో ఐటీ పాలసీ రూపొందిస్తాం




