
ఢిల్లీ: ఉత్తర హస్తినలోని ఇంద్రలోక్ ప్రాంతం తులసినగర్‌లో నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. భవన శిథిలాల్లో మరికొంత మంది చిక్కుకున్నారని, ప్రస్తుతం సంఖ్య కచ్చితంగా చెప్పలేకపోతున్నామని డీసీపీ మధుర్ వర్మ వెల్లడించారు. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు పదిమందిని రక్షించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం మొత్తం కుప్పకూలిపోవడంతో శిథిలాలను తొలగించడం కష్టంగా మారింది. పొక్లెయిన్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ భవనం 50 ఏళ్ల కిందటిదని స్థానికులు తెలిపారు.
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం: ఏడుగురి మృతి




