Wednesday, 4 November 2026

తెలంగాణలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం

tracks
హైదరాబాద్‌: వార్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొంద వూరట తెలంగాణలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం… ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతోంది. వీటికి తోడు తెలంగాణ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గామారాయి. వీటి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో… తెలంగాణలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఇరు రాష్గాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకువెళ్లే మత్సక్యారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *