Tuesday, 3 November 2026

బేగంపేటలో అగ్నిప్రమాదం

um4kjxvm

బేగంపేట(హైదరాబాద్‌): బేగంపేటలోని ఓ వ్యాపార సముదాయంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం… బేగంపేట ప్రధాన రహదారిలో షాపర్స్‌ స్టాప్‌ ఎదురుగా ఉన్న పూజాఎడిఫైస్‌ వాణిజ్య భవనంలోని ్ణొండ్‌ ఫ్లోర్‌లో కొత్తగా ఓ వ్యాపార దుకాణం ప్రారంభించేందుకు ఫర్నీచర్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6.30గంటల సమయంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటల చెలరేగాయి. ఫర్నీచర్‌ వర్క్‌ చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు కార్మికులు అప్రమత్తమై ఘటనా స్థలం నుంచి బయటకు పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *