Tuesday, 3 November 2026

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన కేసీఆర్‌

5t3ny8ie

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు బోనం, పట్టువస్‌ాలు సమర్పించారు. బంగారు బోనం ఎత్తుకుని ఆలయానికి విచ్చేసిన సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ హరిబౌలిలోని అక్కన్న, మాదన్నదేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహంకాళి అమ్మవారి ఆలయ విస్తరణకు కొంత స్థలం కేటాయించి, చిరకాలం గుర్తుండేలా ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *