తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్ : దసరా,దీపావళి మధ్య రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలన్ని పారదర్శకంగా, అవినీతి రహితంగా వుంటాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పధకాలు అమలుకు గ్రామస్థాయిలో సర్వే నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.





