మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై మాయావతి నజర్‌

3
హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఎస్పీ త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి 2015 జనవరి మధ్య మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఢిల్లీలో మాట్లాడుతూ త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతామని తెలిపారు. తాము ఒంటరిగానే పోటీచేస్తామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.