Monday, 2 November 2026

చిల్లర రాజకీయాలు, చీప్‌ ట్రిక్కులు మానండి

3

దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ పార్టీ తనను మోసం చేసిందని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న చిల్లర రాజకీయాలు, చీప్‌ ట్రిక్కులు మానుకోవాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై శనివారం ఆయన స్పందిస్తూ మెదక్‌ ఎంపీ కోసం నా పేరును పరిశీలించాలని టీఆర్‌ఎస్‌ను ఉద్యోగులు కోరారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఉద్యోగుల విభజన సమస్యలు తదితర అంశాలపై రాష్ట్రంలో పనిచేయడం అవసరమని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని చెప్పారు. అందుకు అనుగుణంగానే తన ప్రతిపాదనను విత్‌డ్రా చేసుకున్నానన్నారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడాటానికి కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆయన కోరారు. తనకు మోసం చేశారన్న విషయమే ఉత్పన్నం కాదన్నారు. ఇలాంటి చీప్‌ ట్రిక్కులు పనికిరావన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *