చార్మినార్‌కా షాన్
గూగుల్ సెర్చ్‌లో టాప్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (జనంసాక్షి) : 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ పేరు చెప్పగానే మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్. ఇప్పుడు అది గూగుల్‌లోనే అత్యధికంగా సెర్చ్‌చేసిన చారిత్రక కట్టడంగా రికార్డులు సృష్టిస్తోంది.
గడిచిన ఆరు నెలల్లో అత్యధికంగా వేటికోసం సెర్చ్‌చేశారన్న వివరాలను గూగుల్ చూసినప్పుడు చారిత్రక కట్టడాలలో చార్మినారే నెంబర్ 1గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం), కర్ణాటక, తమిళనాడువాసులు దీనికోసం ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ 2013 సంవత్సరంలో భారతీయ నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన నగరమని, ఈసారి కూడా పర్యాటకులు ఎక్కువగా నగరంలోని చార్మినార్ గురించే వెతికారని చెప్పింది. ఈ నగరంలో సమ్మిళిత సంస్కృతి, చారిత్రక వారసత్వం అన్నీ ఉన్నాయని తెలిపింది. చార్మినార్ తర్వాత హైదరాబాద్‌లో అత్యధికంగా వెతికిన కట్టడం గోల్కొండ కోట. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడువాసులు
ఎక్కువగా వెతికారట. ఈ సెర్చ్‌ల జాబితాలో మూడో స్థానంలో సాలార్‌జంగ్ మ్యూజియం నిలిచింది. ఫలక్‌నుమా
ప్యాలెస్ గురించి కూడా చాలామంది వివరాలు చూశారు.