Tuesday, 3 November 2026

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సేవలు వెలకట్టలేనివి కేసీఆర్‌

555

హైదరాబాద్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. అమ్మ జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు.. తమను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత గురువులదేనన్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండానే తమకు గురువు చదువుచెప్పారని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు. తొమ్మిదో తరగతిలోనే పద్యం రాశా.. అది మా గురువు దయ అని వివరించారు. గురువు సద్గురువు అయితే రాయి సైతం నేర్చుకోలేని విద్య ఉండదన్నారు. తెలుగు భాషను కాపాడుకుంటూనే వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్య అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ… సమగ్ర సర్వే విజయవంతంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో పనిచేద్దామని ఉపాధ్యాయులను కోరారు. గొప్ప శిష్ళ్యలను తయారు చేసే అవకాశం ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *