Tuesday, 3 November 2026

క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ అరెస్టు

2
మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టుచేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల డెంటల్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ బాలాను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.10కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో ప్రముఖ టీవీ ఛానల్‌ యాంకర్‌ హర్షవర్ధన్‌, మరో నలుగురిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు డీఎస్పీ సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం కళాశాలలో కొన్ని అవకతవకలు జరిగాయని, వాటికి సంబంధించి వీడియో క్లిప్పింగులను బయటపెడతామని గత వారం రోజులుగా వీరు ఫాదర్‌బాలాను బెదిరిస్తున్నారు. మొదట అడ్వాన్సుగా రూ.కోటి డిమాండ్‌ చేశారు. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా శనివారం సాయంత్రం బాలాను కలిసి బెదిరించారు. దీంతో బాలా త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్‌ టీంలను రంగంలోకి దింపారు. హర్షవర్ధన్‌ సహా ఇద్దరిని విజయవాడ బెంజి సర్కిల్‌ పరిధిలో, మరో ఇద్దరిని భీమడోలులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, ఐదు మొబైళ్లు, రూ.37,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని డీఎస్పీ సత్తిబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *